వర్షాకాలం ముగిసేలోపు భారత దేశంలో తప్పక చూడాల్సిన ఐదు ప్రదేశాలివే!
Samatha
28 August 2026
వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది టూర్ ప్లాన్ చేస్తుంటారు. అందమైన ప్రదేశాలకు వెళ్లి ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటారు.
అయితే వర్షాకాలంలో ఇతర దేశాలకు కాకుండా భారత దేశంలో ఉన్న కొన్ని అందమైన ప్రదేశాలను తప్పకుండా సందర్శించాలంట. ఇంతకీ అవి ఏవి అంటే?
వర్షాకాలం భారత దేశపు ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. అయితే పచ్చని చెట్లు, అందమైన కొండలు, జాలువారే జలపాతాలు, ఆకాశం నుంచి చిరు జల్లులు.
ఇలా ఎన్నో భారత దేశపు అందాలను చూపెడతాయి. అయితే భారత్‌లో కొన్ని ప్రదేశాల అందాలను చూడాలి అంటే వర్షాకాలం పూర్తి అయ్యేలోపు వాటిని సందర్శించాలంట. అవి
మేఘాలయం, అందం అంటే ఇదేనా అనిపించేలా ఉంటుంది. వర్షాకాలంలో దీని అందాలు వర్ణించడం తగదు, దట్టమైన అడవుల్లో, ఎత్తైన పర్వతాల మధ్య ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్.
అదే విధంగా లోనావాల, వర్షాకాలంలో ఇక్కడి సహ్యాద్రి కొండలు పచ్చదనంతో నిండిపోతాయి. అంతే కాకుండా కొండలు ఆకాశాన్ని తాకాయా అనేలా అక్కడి ప్రకృతి ఉంటుందంట.
కొడై కెనాల్ అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఇక వర్షాకాలంలో ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని పొగడటానికి మాటలు రావు. అంత అద్భుతంగా ఉంటుందంట. వర్షాకాలంలో తప్పక సందర్శించాలి.
అలాగే కేరళలోని వయనాడ్, ఇక్కడి దట్టమైన అడువులు, అందమైన జలపాతాలు, తేయాకు తోటలు, పర్వతాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. పర్యాటకుల మనసు దోచడంలో ఇది ముందుంటుంది.