ఇంట్లో నెమలిఈక ఇక్కడ ఉంటే.. లక్ష్మీదేవి ఉన్నట్లే,ధన దాన్యాలకు లోటే ఉండదు..
Samatha
28 August 2026
నెమలి ఈకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిందూ మతంలో వీటికి ప్రత్యేక ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంటుంది.
శ్రీకృష్ణుడు దీనిని తన కిరీటంపై ధరించాడు. అందువలన దీనికి మరింత ప్రాముఖ్యత చేకూరింది. అయితే ఈ నెమలి ఈక ఇంటిలో ఉండటం చాలా శుభప్రదం అని చెబుతున్నారు పండితులు.
వాస్తు ప్రకారం ఇంటిలో నెమలి ఈక సరైన దిశలో ఉండటం వలన వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నివిధాలుగా కలిసి వస్తుందని చెబుతుంటారు.
ముఖ్యంగా ఇంటిలో ఒక చోట నెమలి ఈక పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలగడమే కాకుండా, ధన ధాన్యాలకు కూడా ఏమాత్రం లోటే ఉండదంట. దాని గురించి తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం ఇంటిలో నెమలి ఈక నైరుతి , తూర్పు దిశలో పెట్టడం చాలా మంచిదంట. దీని వలన ఆర్థింగా కలిసి రావడమే కాకుండా, బంధాలు కూడా బలంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
అంతే కాకుండా ఈ దిశలో నెమలి ఈకను పెట్టడం వలన భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. వైవాహిక జీవితం చాలా ఆనందంగా కొనసాగుతుందంట.
ఇక ఎప్పుడూ కూడా నెమలి ఈకను అపరిశుభ్ర ప్రదేశంలో అలంకారంగా తమకు నచ్చిన చోట నెమలి ఈకను పెట్టడం అస్సలే మంచిదికాదంట.
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.