AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే టికెట్‌లో GNWL, RLWL, PQWL మధ్య తేడా ఏంటి? కన్ఫర్మేషన్ ఛాన్స్ దేనికి ఎక్కువ?

Indian Railways: రైల్వే టికెట్ బుక్ చేసేటప్పుడు సీట్లు అందుబాటులో లేకపోతే GNWL, RLWL, PQWL వంటి వెయిటింగ్ లిస్ట్ కోడ్‌లతో టికెట్ ఇస్తారు. అయితే వీటి అర్థం ఏమిటి? ఏ వెయిటింగ్ లిస్ట్ టికెట్‌కు కన్ఫర్మేషన్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? ప్రయాణికులు తెలుసుకోవాల్సిన GNWL, RLWL, PQWL మధ్య తేడాలు, కన్ఫర్మేషన్ ఛాన్సుల గురించి తెలుసుకుందాం.

రైల్వే టికెట్‌లో GNWL, RLWL, PQWL మధ్య తేడా ఏంటి? కన్ఫర్మేషన్ ఛాన్స్ దేనికి ఎక్కువ?
GNWL vs RLWL vs PQWL
Janardhan Veluru
|

Updated on: Aug 28, 2026 | 4:07 PM

Share

రైలు ప్రయాణం కోసం టికెట్ రిజర్వేషన్ చేసేటప్పుడు సీటు అందుబాటులో లేని పక్షంతో వెయిటింగ్ లిస్ట్‌ టికెట్ వస్తుంది. అయితే ఈ వెయిటింగ్ లిస్ట్ టికెట్‌పై GNWL, RLWL, PQWL వంటి కోడ్‌లు కనిపిస్తుంటాయి. వీటి అర్థం ఏమిటి? వీటిలో ఏ వెయిటింగ్ లిస్ట్ టికెట్ ముందుగా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది? అనే సందేహం చాలామంది ప్రయాణికులకు ఉంటుంది. ప్రతి వెయిటింగ్ లిస్ట్‌కు ప్రత్యేక కోటా, నిబంధనలు ఉంటాయి. అందువల్ల టికెట్ బుక్ చేసుకునే ముందు వీటి మధ్య తేడాలను తెలుసుకోవడం ఎంతో మంచిది. అప్పుడే మీ వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందా? లేదా? అనే విషయంలో కూడా మీకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.

GNWL అంటే ఏమిటి?

GNWL అంటే General Waiting List (జనరల్ వెయిటింగ్ లిస్ట్). రైల్వే టికెట్ బుక్ చేసేటప్పుడు సీట్లు/బెర్త్‌లు అందుబాటులో లేకపోతే ఈ వెయిటింగ్ లిస్ట్‌లో టికెట్ వస్తుంది. సాధారణంగా రైలు ప్రారంభ స్టేషన్ నుంచి లేదా దానికి సమీపంలోని ప్రధాన స్టేషన్ నుంచి ప్రయాణించే ప్రయాణికులకు GNWL వర్తిస్తుంది. సాధారణంగా వెయిటింగ్ లిస్ట్‌లలో కన్ఫర్మేషన్ అవకాశాలు ఎక్కువగా ఉండే కేటగిరీగా పరిగణిస్తారు.ఇతర వెయిటింగ్ లిస్ట్‌లతో పోలిస్తే GNWLలో ఎక్కువ సంఖ్యలో బెర్త్‌లు కేటాయించే అవకాశం ఉంటుంది. ప్రయాణికులు టికెట్లు క్యాన్సిల్ చేసుకోవడం, అదనపు కోటా విడుదల చేసిన సందర్భాల్లో GNWL టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. RLWL, PQWL కంటే GNWL వెయిట్ లిస్టెడ్ టికెట్లు కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.

RLWL అంటే ఏమిటి?

RLWL అంటే Remote Location Waiting List. రైలు మార్గంలోని ముఖ్యమైన మధ్యస్థ స్టేషన్ల నుంచి ప్రయాణించే వారికి ఈ వెయిటింగ్ లిస్ట్ వర్తిస్తుంది. ఇలాంటి స్టేషన్ల కోసం రైల్వే ప్రత్యేకంగా కొన్ని బెర్త్‌లను కేటాయిస్తుంది. జనరల్ వెయిటింగ్ లిస్ట్ (GNWL) తర్వాత RLWL టికెట్లకు కన్ఫర్మేషన్ అవకాశం ఉంటుంది. ప్రయాణికుల టికెట్లు రద్దు కావడం లేదా సంబంధిత కోటాలో బెర్త్‌లు ఖాళీ కావడం వంటి పరిస్థితుల్లో RLWL ముందుకు కదులుతుంది.

ఇవి కూడా చదవండి

PQWL అంటే ఏమిటి?

PQWL అంటే Pooled Quota Waiting List. సాధారణంగా చిన్న స్టేషన్ల మధ్య ప్రయాణించే వారికి ఈ కోటా వర్తిస్తుంది. పలు చిన్న స్టేషన్లను కలిపి ఒకే పూల్డ్ కోటాను ఏర్పాటు చేస్తారు. ఈ కోటాలో అందుబాటులో ఉండే బెర్త్‌ల సంఖ్య పరిమితంగా ఉంటుంది. అలాగే ఈ కోటాలో టికెట్లు రద్దు కావడం తక్కువగా ఉండటంతో వెయిటింగ్ లిస్ట్ నెమ్మదిగా కదిలే అవకాశం ఉంటుంది. దీంతో PQWL టికెట్ కన్ఫర్మేషన్ అవకాశాలు తక్కువగా ఉంటాయి.

RLWL, PQWL.. కన్ఫర్మేషన్ ఛాన్స్ దేనికి ఎక్కువ?

రెండింటినీ పోల్చితే PQWL కంటే RLWL టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు RLWLలో వెయిటింగ్ 10 నుంచి 15 వరకు ఉంటే కన్ఫర్మేషన్‌కు అవకాశం ఉంటుంది. అదే PQWLలో వెయిటింగ్ 5 దాటితే కన్ఫర్మేషన్ అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. అయితే వాస్తవ కన్ఫర్మేషన్ అనేది రైలు, మార్గం, తేదీ, కోటా, రద్దులు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఏది మంచిది?

వీలైనంత వరకు GNWL లేదా RLWL వెయిటింగ్ లిస్ట్‌లో టికెట్ లభించేలా చూడటం మంచిది. PQWLలో వెయిటింగ్ ఎక్కువగా ఉంటే చివరి నిమిషం వరకు వేచి చూడటం మంచిదికాదు. అత్యవసర ప్రయాణం ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ రైలు లేదా ఇతర ప్రయాణ మార్గాలను కూడా ముందుగానే పరిశీలించడం మంచిది.

‘వికల్ప్’ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు

రైల్వే టికెట్ బుకింగ్ సమయంలో ‘వికల్ప్’ స్కీమ్ అందుబాటులో ఉంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు. కన్ఫర్మ్ సీటు లభించని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రైలులో సీటు పొందే అవకాశం కల్పించడమే దీని ఉద్దేశం. అందువల్ల రైలు టికెట్‌పై RLWL, PQWL అని కనిపించినప్పుడు ఆ కోడ్‌ల అర్థం తెలుసుకోవడంతో పాటు, మీ వెయిటింగ్ నంబర్‌, ప్రయాణ తేదీ, రైలు రూట్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవడం మంచిది.

Follow Us
రైల్వే టికెట్‌లో GNWL, RLWL, PQWL మధ్య తేడా ఏంటి?
రైల్వే టికెట్‌లో GNWL, RLWL, PQWL మధ్య తేడా ఏంటి?
జుట్టు విపరీతంగా రాలుతోందా? మీరు రోజూ తినే ఆహారంలో ఇవి ఉంటే చాలు.
జుట్టు విపరీతంగా రాలుతోందా? మీరు రోజూ తినే ఆహారంలో ఇవి ఉంటే చాలు.
అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య.. ఆగ్రాలో నిందితుడి అరెస్ట్
అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య.. ఆగ్రాలో నిందితుడి అరెస్ట్
వస్తూ వస్తూనే అదృష్టం తెస్తున్న గణపయ్య.. ఇక వీరికి పండుగే
వస్తూ వస్తూనే అదృష్టం తెస్తున్న గణపయ్య.. ఇక వీరికి పండుగే
అమృతమే.. పనస పండు హల్వా ఇలా చేస్తే అదిరిపోద్దీ
అమృతమే.. పనస పండు హల్వా ఇలా చేస్తే అదిరిపోద్దీ
పసిపిల్లల నుంచి పెద్దోళ్ల వరకు చలువ చేసే అతి ప్రాచీన హల్వా
పసిపిల్లల నుంచి పెద్దోళ్ల వరకు చలువ చేసే అతి ప్రాచీన హల్వా
ఎలాంటి రాత పరీక్ష లేకుండానే.. RRC రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగాలు!
ఎలాంటి రాత పరీక్ష లేకుండానే.. RRC రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగాలు!
మన టైమ్ వచ్చేసింది భయ్యా..ఆ రాశులకు ఆకస్మిక ధన లాభాలు..!
మన టైమ్ వచ్చేసింది భయ్యా..ఆ రాశులకు ఆకస్మిక ధన లాభాలు..!
నేపాల్‌కు భారత్ 47 టన్నుల సామగ్రి!సహాయక చర్యలకు 'సి-17' విమానాలు
నేపాల్‌కు భారత్ 47 టన్నుల సామగ్రి!సహాయక చర్యలకు 'సి-17' విమానాలు
తులసి మొక్క పచ్చగా గుబురుగా మారాలంటే ఇలా చేయండి.. అస్సలు తిరుగుండ
తులసి మొక్క పచ్చగా గుబురుగా మారాలంటే ఇలా చేయండి.. అస్సలు తిరుగుండ