AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలాంటి రాత పరీక్ష లేకుండానే RRC రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగాలు.. సెప్టెంబరు 1 నుంచి దరఖాస్తులు షురూ

క్రీడాకారులకు వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. 2026-27 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటా కింద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్, ఇంటర్ లేదా డిగ్రీతో పాటు నిర్దిష్ట క్రీడా అర్హతలు ఉన్న 18 నుంచి 25 ఏళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబరు 1 నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి..

ఎలాంటి రాత పరీక్ష లేకుండానే RRC రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగాలు.. సెప్టెంబరు 1 నుంచి దరఖాస్తులు షురూ
RRC Western Railway Sports Quota Recruitment
Srilakshmi C
|

Updated on: Aug 28, 2026 | 3:36 PM

Share

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న క్రీడాకారులకు ఇండియన్‌ రైల్వే తీపికబురు అందించింది. వెస్ట్రన్ రైల్వేలో 2026-27 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటా కింద పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద వివిధ డివిజన్లు, యూనిట్లలో మొత్తం 64 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్ధులు సెప్టెంబరు 1, 2026వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు..

  • పే లెవల్ 5/4 కింద 5 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు అథ్లెటిక్స్ (పురుషులు), జిమ్నాస్టిక్స్ (పురుషులు), హాకీ (మహిళలు), వెయిట్‌లిఫ్టింగ్ (పురుషులు), రెజ్లింగ్ (పురుషులు-ఫ్రీ స్టైల్) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
  • పే లెవల్ 3/2 కింద 16 పోస్టులు ఉన్నాయి. అథ్లెటిక్స్, క్రికెట్, డైవింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, పవర్‌లిఫ్టింగ్, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ తదితర క్రీడా విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.
  • పే లెవల్ 1 కింద 43 పోస్టులు ఉన్నాయి. అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, హాకీ, హ్యాండ్‌బాల్, ఖో-ఖో, పవర్‌లిఫ్టింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, వాటర్ పోలో, వెయిట్‌లిఫ్టింగ్ తదితర క్రీడల్లో ఖాళీలు ఉన్నాయి.

వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి టెన్త్, ఇంటర్ లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నోటిఫికేషన్‌లో పేర్కొన్న సంబంధిత క్రీడల్లో అర్హతలను కూడా కలిగి ఉండాలి. అభ్యర్థులు ఒలింపిక్ గేమ్స్‌ (సీనియర్)లో దేశానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి. లేదంటే వరల్డ్ కప్, వరల్డ్ ఛాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, యూత్ ఒలింపిక్స్, ఛాంపియన్స్ ట్రోఫీ, థామస్/ఉబెర్ కప్ వంటి గుర్తింపు పొందిన అంతర్జాతీయ పోటీల్లో కనీసం మూడో స్థానం సాధించిన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇక అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 30, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం సంబంధిత క్రీడా ట్రయల్స్ ద్వారా మాత్రమే జరుగుతుంది. క్రీడా ప్రతిభ ఆధారంగా నిర్వహించే ఎంపిక ప్రక్రియలో అర్హత సాధించిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: సెప్టెంబర్‌ 1, 2026.
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 30, 2026

వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us