Adilabad District: కరెంట్ బిల్లు చెల్లించమనడమే పాపమా..! అధికారులను నిర్భందించి చితకొట్టిన గ్రామస్తులు..

Adilabad District News: బిల్లు‌లు కడితేనే కరెంట్ పునరిద్దరిస్తామంటూ అధికారులు తెగేసి చెప్పడంతో.. ఆగ్రహం కట్టలు‌ తెంచుకున్న స్థానికులు విద్యుత్ సిబ్బందిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. గ్రామంలో కరెంట్ బిల్లుల వసూళ్లకు వచ్చిన సిబ్బందితో సహా అధికారులపై దాడికి దిగడమే కాకుండా వారందరిని బంధించి గ్రామ పంచాయితీలో నిర్భందించారు. అక్కడితో ఆగకుండా బూతులు తిడుతూ.. పంచాయితీ కార్యాలయంలో..

Adilabad District: కరెంట్ బిల్లు చెల్లించమనడమే పాపమా..! అధికారులను నిర్భందించి చితకొట్టిన గ్రామస్తులు..
Spot Visuals

Edited By:

Updated on: Sep 22, 2023 | 8:40 AM

ఆదిలాబాద్ జిల్లా, సెప్టెంబర్ 22: కరెంట్ బిల్లులు కట్టడం లేదంటూ కనెక్షన్‌లు కట్ చేసిన విద్యుత్ సిబ్బందిపైకి గ్రామస్తులు తిరగబడ్డారు. అధికారులను‌, సిబ్బందిని అడ్డుకుని కరెంట్ ఎలా కట్ చేస్తారంటూ నిలదీశారు. బకాయిలు పెరిగిపోయాయని.. బిల్లు‌లు కడితేనే కరెంట్ పునరిద్దరిస్తామంటూ అధికారులు తెగేసి చెప్పడంతో.. ఆగ్రహం కట్టలు‌ తెంచుకున్న స్థానికులు విద్యుత్ సిబ్బందిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. గ్రామంలో కరెంట్ బిల్లుల వసూళ్లకు వచ్చిన సిబ్బందితో సహా అధికారులపై దాడికి దిగడమే కాకుండా వారందరిని బంధించి గ్రామ పంచాయితీలో నిర్భందించారు. అక్కడితో ఆగకుండా బూతులు తిడుతూ.. పంచాయితీ కార్యాలయంలో విచక్షణా రహితంగా దాడికి దిగారు. ఈ దారుణ ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆదిలాబాద్ జిల్లాలో కరెంట్ బిల్లుల వసూళ్లకు వెళ్లిన విద్యుత్తు సిబ్బందిపై గ్రామస్తులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. డీఈ, ఏఈలతో పాటు లైన్ ఇన్ స్పెక్టర్, ఇద్దరు జేఎల్ఎంలు, విలేజ్ వర్కర్స్ పై పిడిగుద్దులతో విరుచుకు పడ్టారు కొందరు స్థానికులు. ‘మా ఊర్లోనే కరెంట్ కట్ చేస్తారా.. మీకెంత ధైర్యం’ అంటూ దాడికి దిగారు స్థానికులు. దాడి దృశ్యాలు‌ చిత్రీకరిస్తున్న లేఖర్వాడకు చెందిన విలేజ్ వర్కర్‌పై సైతం దాడికి దిగారు స్థానికులు. గిమ్మ గ్రామంలోని స్థానిక హనుమాన్ ఆలయ సమీపం నుంచి పంచాయతీ కార్యాలయం వరకు అధికారులపై దుర్భాషలాడుతూ పిడిగిద్దులతో లాక్కెల్లిన స్థానికులు.. విద్యుత్ సిబ్బందిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మూడు గంటల పాటు నిర్భందించారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.

ఈనెల 20న విధుల్లో భాగంగా గ్రామాల్లో విద్యుత్ బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక రైడ్ చేపట్టారు ఆదిలాబాద్ విద్యుత్ అధికారులు. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో బుధవారం డీఈ హరికృష్ణ, ఏఈ గంగధర్లు విద్యుత్తు సిబ్బందితో కలిసి ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. గిమ్మ గ్రామంలో భారీగా విద్యుత్ బకాయిలు పేరుకు పోవడంతో బిల్లులు చెల్లించమంటూ వినియోగం దారులను కోరారు విద్యుత్తు అధికారులు. 10 వేల పైగా కరెంట్ బిల్ పెండింగ్ లో ఉన్న 50 మీటర్ల కనెక్షన్లను ఓవర్ డ్యూ లిస్ట్ లో చేర్చి.. ఆయా ఇండ్లకు కరెంట్ కనెక్షన్ తొలగించారు విద్యుత్ సిబ్బంది. దీంతో తమ కనెక్షన్లు ఎలా కట్ చేస్తారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు 50 మంది. మాటమాట పెరిగి గొడవ ముదరడంతో డీఈ హరికృష్ణ, ఏఈ గంగాధర్, లైన్ ఇన్స్పెక్టర్ మోహన్, ఇద్దరు జేఎల్ఎంలు నరేష్, సతీష్ లపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు గ్రామస్తులు. అధికారులపై దాడి చేస్తున్న దృశ్యాలను లేఖర్వాడకు చెందిన విలేజ్ వర్కర్ ఎస్కే రవూఫ్ వీడియో చిత్రీకరిస్తుండగా అతనిపై సైతం దాడికి పాల్పడ్డారు స్థానికులు. తొలగించిన 50 కనెక్షన్లు పునరుద్ధరించాలంటూ స్థానిక‌ గ్రామపంచాయితీలో సిబ్బందిని బందించి చిత్రహింసలకు గురి చేశారు. అనంతరం ఉన్నతాదికారులు కరెంట్ పునరుద్ధరిస్తామంటూ హామీ ఇవ్వడంతో 5 గంటల తర్వాత అధికారులను , సిబ్బంది ని వదిలేశారు గిమ్మ వాసులు. దాడికి దిగిన గిమ్మ గ్రామంలోని వ్యక్తులపై జైనథ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశార భోరజ్ ఏఈ గంగాధర్. కేసు నమోదు చేసుకున్న ఎస్సై విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

గిమ్మ గ్రామంలో 210 కనెక్షన్లకు సంబంధించి రూ. 36 లక్షలు బిల్లు పెండింగ్‌లో ఉంది. బిల్లు చెల్లించకపోవడంతో ఎస్సీ కాలనీలో 150 ఇళ్ల కరెంట్ కనెక్షన్లు తొలగించారు విద్యుత్ అధికారులు. దీంతో గ్రామస్తులు కోపోద్రిక్తులై అధికారులపై దాడి చేశారు. అందరినీ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి కరెంటు సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఉన్నతాదికారుల ఆదేశాలతో చివరకు గ్రామంలో విద్యుత్‌ కనెక్షన్లు పునరుద్ధరించారు. ఎస్సై పురుషోత్తం సంఘటన స్థలానికి చేరుకొని అధికారులను అక్కడి నుంచి ఆదిలాబాద్‌కు తరలించారు. నోటీసు ఇవ్వకుండా కరెంట్‌ కట్‌ చేయడం సరికాదంటూ ఆందోళన చేయడంతో అధికారులు నోటికొచ్చినట్టు మాట్లాడారని అందుకే అడ్డుకున్నామని తెలిపారు గ్రామస్తులు. ఎస్సీలకు ప్రభుత్వం 150 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించిన కూడా అధికారులు వేధించడం సరికాదని వాపోయారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..