Telangana Election: ఈ ఊళ్లో పోలింగ్‌ను బహిష్కరించిన ఓటర్లు.. అసలు కారణం ఇదే..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చెదురుమొదురు సంఘటనలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ సజావుగా జరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఓట్లు వేయడానికి సుముఖత చూపించలేదు ఓటర్లు. పూర్తిగా పోలింగ్‌ను బహిష్కరించారు. ఇలాంటి పరిస్థితి గత వారం రాజస్థాన్లోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చెదురుమొదురు సంఘటనలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ సజావుగా జరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఓట్లు వేయడానికి సుముఖత చూపించలేదు ఓటర్లు. పూర్తిగా పోలింగ్‌ను బహిష్కరించారు. ఇలాంటి పరిస్థితి గత వారం రాజస్థాన్లోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. తమకు సరైన రోడ్లు వేయడంలో నాయకులు చొరవ చూపలేదంటూ మూడు దశాబ్ధాలుగా ఓట్లు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే ఇలాంటి ఘటనే మన తెలంగాణలో జరగడం కొత్త చర్చకు దారి తీస్తోంది.
అదిలాబాద్ జిల్లా, బీంపూర్ మండలంలోని థాంసీ గ్రామం ఈమధ్య కాలంలో గొల్లగడ్ అనే కొత్త పంచాయితీగా ఏర్పాడింది. ఈ మండలం మొత్తం 26 గ్రామాలు ఉండగా.. ఏ ఒక్కరూ ఓటు వేయడానికి ముందుకు రాలేదు. సాధారణంగా ఇక్కడ 80శాతం ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నప్పటికీ ఓటు వినియోగించుకోకపోవడానికి గల ప్రదాన కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 79.86 శాతం ఓటింగ్ జరిగింది. అయితే కొన్ని గ్రామాల్లో ఓటర్లు నాయకుల మీద అలకబూనారు. తమకు డబ్బులు పంచలేదనో, సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో జాప్యం చేశారనో ఓటింగ్‌లో కొంతమందే పాల్గొన్నారు. అయితే రాజకీయ నాయకులు తమ ప్రాంతాన్ని పట్టించుకోలేదని, ప్రచారంలో కూడా ఎవరూ తమను పలకరించలేదని, తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని పూర్తి స్థాయిలో పోలింగ్‌ను బహిష్కరించారు గొల్లగడ్ గ్రామస్తులు.
ఈ విషయం తెలుసుకున్న నాయకులు, అధికారులు ఎంత బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్ తమ వద్దకు వచ్చి తగిన న్యాయం చేస్తామని చెబితే అప్పుడు పోలింగ్‌లో పాల్గొంటామని నిరసనలు చేశారు. కలెక్టర్ ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్న కారణంగా ఫోన్‌లో మాట్లాడారు. కలెక్టర్‌తో మాట్లాడిన గ్రామస్తులకు నమ్మకం కలుగక పోవడంతో ఓటేసేందుకు వెళ్లమని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలింగ్ అధికారులు చేసేదేమీ లేక సాయంత్రం 5 వరకు విధులు నిర్వహించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..