Minister KTR: 100 శాతం అధికారంలోకి వస్తాం.. సర్వే సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మొద్దు.. మంత్రి కేటీఆర్

తెలంగాణ దంగల్ ముగిసింది. పోలింగ్ ముగియడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ తరుణంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయాలను వెడెక్కిస్తున్నాయి. చాలా సర్వేలు బీఆర్ఎస్.. కాంగ్రెస్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ నెలకొన్నట్లు పేర్కొంటున్నాయి. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

Minister KTR: 100 శాతం అధికారంలోకి వస్తాం.. సర్వే సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మొద్దు.. మంత్రి కేటీఆర్
BRS Working President KTR (File Photo)
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 30, 2023 | 6:46 PM

తెలంగాణ దంగల్ ముగిసింది. పోలింగ్ ముగియడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ తరుణంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయాలను వెడెక్కిస్తున్నాయి. చాలా సర్వేలు బీఆర్ఎస్.. కాంగ్రెస్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ నెలకొన్నట్లు పేర్కొంటున్నాయి. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 70సీట్లకు తగ్గకుండా తెలంగాణలో గెలుస్తామంటూ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. ఎగ్జిట్ పోల్స్‌ చూసి కార్యకర్తలు కంగారుపడొద్దంటూ కేటీఆర్ సూచించారు. డిసెంబర్ 3న ఫలితాల్లో బీఆర్‌ఎస్ గెలుస్తుందంటూ కేటీఆర్ వెల్లడించారు. కేసీఆర్ మూడోసారి సీఎంగా ప్రమాణం చేస్తారంటూ కేటీఆర్ తెలిపారు.

2018లో ఎగ్జిట్‌ పోల్స్‌ లో ఒక్క సంస్థ మాత్రమే సరిగా చెప్పిందంటూ కేటీఆర్ పేర్కొన్నారు. 2018లోనూ బీఆర్ఎస్ ఓడిపోతుందని ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పాయని వివరించారు. ప్రస్తుతం 70కి పైగా స్థానాలతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. డిసెంబరు 3న ఫలితాలు వచ్చాకా ఈ సర్వే సంస్థలన్నీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతాయా? అంటూ ప్రశ్నించారు. పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినప్పటి నుంచి రెండు నుంచి మూడు నెలల పాటు కష్టపడిన బీఆర్ఎస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.

ఓటర్లు ఇంకా పోలింగ్ కేంద్రాల్లో ఉన్నారని.. సర్వే సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మొద్దంటూ కేటీఆర్ సూచించారు. 100 శాతం అధికారంలోకి వస్తాం.. కార్యకర్తలు, నాయకులు గందరగోళానికి గురికావొద్దంటూ సూచించారు.

వీడియో చూడండి..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
"వితౌట్ ఐస్'' అని చెప్పడం మరిచిపోతున్నారా.? అంతే సంగతులు..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..