Telangana Elections 2023: ముగిసిన తెలంగాణ దంగల్.. హైదరాబాద్‌లో అత్యల్పంగా పోలింగ్.. పూర్తి వివరాలివే..
Telangana Elections 2023 Voting Highlights: పోలింగ్ ముగిసింది. ఓటర్ తీర్పు ఈవీఎంలో భద్రంగా ఉంది. డిసెంబర్ 3న అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. అయితే ఈ సారి పోలింగ్ సరళి ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పోలింగ్ ఎవరికి అనుకూలంగా మారబోతుంది. ఎవరికి నష్టం చేకూర్చబోతుందనేది అర్థం కాని పరిస్థితి.
Telangana Elections 2023 Voting Highlights: తెలంగాణ దంగల్ ముగిసింది. అక్కడక్కడా కొన్ని ఘర్షణలు జరిగినప్పటికీ.. మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్ తీర్పు ఈవీఎంలో భద్రంగా ఉంది. డిసెంబర్ 3న అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. అయితే ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల సరళి, నమోదైన పోలింగ్ అన్ని పార్టీలను టెన్షన్ పెడుతోంది. రాత్రి 7 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా 64.26 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 82.05 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత జనగామలో 80.2శాతం, యాదాద్రిలో 78.31 శాతం పోలింగ్ నమోదైంది. ఇక అత్యల్పంగా ఎప్పటిలాగే హైదరాబాద్‌లో 40.88 శాతం పోలింగ్ నమోదైంది.
జనగామ-80.23, భూపాలపల్లి-76.10శాతం పోలింగ్
ఆదిలాబాద్-73.58, భద్రాద్రి-66.37, హనుమకొండ-62.46, జగిత్యాల-74.87, జనగామ-80.23, భూపాలపల్లి-76.10శాతం పోలింగ్ నమోదైంది. గద్వాల్-73.60, కామారెడ్డి-73.22 శాతం, కరీంనగర్-69.22, ఖమ్మం-73.77, ఆసిఫాబాద్-71.63, మహబూబాబాద్-77.50 మహబూబ్‌నగర్‌లో 73.70శాతం మంది ఓటేశారు.
Today Telangana Tuned to Voters Vibrant Voice !
Watch the recap of today’s Telangana Assembly Elections Poll #ECI #AssemblyElections2023 #TelanganaElections2023 #GoVote #IVote4Sure pic.twitter.com/hAAx62Ddda
— Election Commission of India (@ECISVEEP) November 30, 2023
ఇక మంచిర్యాల-71.59, మేడ్చల్-49.25, ములుగు-75.02, నాగర్‌కర్నూల్-70.83, నల్గొండ-75.72, నారాయణపేట-67.70, నిర్మల్-74.23, నిజామాబాద్-68.30, పెద్దపల్లి-69.83, సిరిసిల్ల-71.87, రంగారెడ్డి-53.03, సంగారెడ్డి-73.85, సిద్దిపేట-77.19, సూర్యాపేట-74.88, వికారాబాద్-69.79, వనపర్తి-77.54, వరంగల్‌లో -73.04 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
2018 ఎన్నికల్లో 73.20 శాతం పోలింగ్ నమోదవగా.. ఈ సారి 7 గంటల వరకూ ఉన్న సమాచారం ప్రకారం 64.26శాతం నమోదైంది. 5 గంటల్లోపు పోలింగ్ బూత్ లోపలికి వెళ్లిన వాళ్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించింది ఈసీ.
PwD Voter Casted her vote at PS 174 kommala 104-Parkal AC#CEOTelangana #ECI #ECISVEEP #ecispokesperson #TelanganaAssemblyElection2023 @ECISVEEP @SpokespersonECI pic.twitter.com/F8wnqAJtAt
— CEO Telangana (@CEO_Telangana) November 30, 2023
2018లో గ్రేటర్ పరిధిలో 42శాతం పోలింగ్
2018లో గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ 42శాతానికి పైగా నమోదైంది. కానీ ఈసారి అది 40కంటే కిందే ఆగిపోయింది. అర్బన్ ఓటర్ పూర్తిగా పోలింగ్‌కి మొహం చాటేసినట్టు అర్థమవుతోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున ఓటేశారు. దీంతో ఈసారి తెలంగాణ ఫలితాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..