AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ బస్సు ప్రయాణమంటే విద్యార్థులు హడల్.. చదువుకోసం పణంగా ప్రాణాలు..

అర్టీసి బస్సులో వెళ్తున్న విద్యార్థులు నిత్యం నరకం చూస్తున్నారు. ఊపిరి ఆడకుండానే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. స్టేజీలపై విద్యార్థులు కనబడితే చాలు బస్సులు ఆపకుండా వేగంగా వెళ్తున్నాయి. ఉదయం సాయంత్రం వేళల్లో పాఠశాల, కళాశాలకి వెళ్ళే విద్యార్థులు ఒక రకంగా యుద్దమే చేస్తున్నారు.

ఆ బస్సు ప్రయాణమంటే విద్యార్థులు హడల్.. చదువుకోసం పణంగా ప్రాణాలు..
Karimnagar
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jun 28, 2024 | 3:05 PM

Share

అర్టీసి బస్సులో వెళ్తున్న విద్యార్థులు నిత్యం నరకం చూస్తున్నారు. ఊపిరి ఆడకుండానే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. స్టేజీలపై విద్యార్థులు కనబడితే చాలు బస్సులు ఆపకుండా వేగంగా వెళ్తున్నాయి. ఉదయం సాయంత్రం వేళల్లో పాఠశాల, కళాశాలకి వెళ్ళే విద్యార్థులు ఒక రకంగా యుద్దమే చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో‌ స్వగ్రామం నుండి చాల మంది విద్యార్థులు పట్టణాలు, మండల కేంద్రాలకి చదువుకోవడానికి అర్టీసి బస్సులలో అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. అయితే చాలా ప్రాంతాలలో విద్యార్థుల సంఖ్యకి అనుగుణంగా ఆర్టీసీ ‌బస్సులు నడపడం లేదు. ఈ క్రమంలోనే అందుబాటులో నడిచే అర్టీసీ బస్సుల్లొ ప్రయాణం చేస్తున్నారు. కనీసం నిలబడేందుకు‌ కూడా బస్సులలో‌ అవకాశం ఉండడం లేదు. గట్టుభుత్కూర్, గర్షకుర్తి, కురిక్యాల మీదుగా గంగాధర మాడల్‌ స్కూల్‎కి చేరుకుంటుంది. ఇలా ఉదయం ‌పూట ఒకే బస్సు ఉండడంతో విద్యార్థులు ‌అందరూ ఇదే బస్సులో ‌ఎక్కుతున్నారు.

60 సీట్లు‌‌ ఈ‌ బస్సులో ఉంటే.. ‌150 నుండి‌ 180 మంది‌ విద్యార్థులు ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నారు. ప్రమాదం అని తెలిసినా ‌పుట్ బోర్డుపైనా ప్రయాణం చేస్తున్నారు. రెండు‌ రోజుల క్రితం ఊపిరి అడక ఒక విద్యార్థికి ఫిట్స్ వచ్చింది. దీనితో విద్యార్థులు వెంటనే గమనించి బస్సు ‌దింపి‌ అసుపత్రికి‌ తరలించారు. విద్యార్థులకు‌‌ బస్సులో‌ ప్రయాణం చేసేటప్పుడు కనీసం గాలి కూడ అడడం‌లేదు. పాఠశాలకు అప్పుడప్పుడు అలస్యంగా వెళ్తున్నారు. బస్సు దొరకకపోతే పేరేంట్స్ స్కూల్ వద్ద దింపేస్తున్నారు. ఈ సమస్య ‌కేవలం ఒకగ్రామానికే కాకుండా‌ చాలా గ్రామాలలో కనిపిస్తోంది.‌ ఇలాంటి సమస్యలతో ప్రతిరోజూ ‌విద్యార్థులు‌ ఇబ్బందులు ‌పడుతున్నారు. అంతే కాకుండా కండిషన్ బస్సుల ‌కారణంగా‌ మరింత‌ అందోళన కనబడుతుంది. పాఠశాల‌కి వెళ్ళే ‌విద్యార్థి‌ ఇంటికి వచ్చే వరకు‌ తల్లిదండ్రులు భయం భయంగా‌ ఎదురు చూస్తున్నారు.

ఉదయం పూట ఎలాగో‌ పాఠశాల, కళాశాలకి వెళ్ళినప్పటికీ సాయంత్రం ‌ఇంటికి రావడం ఆలస్యం ‌అవుతుంది. బస్సుల కోసం విద్యార్థులు‌ పడిగాపులు కాస్తూ పరుగులు తీస్తున్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి తదితర బస్టాండుల్లో సాయంత్రం ఎటూ చూసిన విద్యార్థుల ‌రద్దీ కనబడుతుంది. ఫ్లాట్ ఫాం వద్ద విద్యార్థుల సంఖ్య ‌ఎక్కువగా‌ఉంటే ఆటువైపుకు బస్సు‌ రాకుండానే వెళ్ళి ‌పోతున్న సందర్భాలు‌ కూడా చాలా ఉన్నాయి. విద్యార్థులు ‌ప్రయాణం‌ చేసే రూట్లలలో‌ అర్టీసి ‌బస్సుల‌ సంఖ్యను‌ పెంచాలని‌ తల్లిదండ్రులు ‌కోరుతున్నారు. ఈ‌ సమస్యలను సత్వరం పరిష్కరించాలని స్థానికులు‌ అర్టీసి అధికారులకు విన్నవించుకుంటున్నారు.

గతంలో ‌విద్యార్థులు‌ బస్సులు ఎక్కువగా ‌నడిపించాలని అర్టీసి ‌అధికారులకి విన్నవించారు. అయినా స్పందన ‌కరువు అయ్యిందని వాపోతున్నారు. అర్టీసి ‌బస్సులో‌ పాఠశాలకి వెళ్ళాలంటే భయం‌ వేస్తుందని విద్యార్థులు ‌చెబుతున్నారు. కనీసం ఊపిరి కూడ అడడం లేదని విద్యార్థులు ‌అందోళనతో చెందుతున్నారు. ఈ ప్రయాణం కారణంగా చదువుపై‌ సరిగా దృష్టి ‌పెట్టలేక పోతున్నామని, తమకి‌ అదనంగా మరో‌ రెండు బస్సులు నడిపించాలని కోరుతున్నారు. అర్టీసి ‌బస్సులో‌ విద్యార్థుల ‌రద్దీ‌ ఎక్కువగా ఉందని దీంతో పాఠశాలకు‌ పంపించాలంటే భయం వేస్తుందని‌ తల్లిదండ్రులు చెబుతున్నారు. పిల్లలు ఇంటికి వచ్చే వరకు భయం భయంగా‌ ఎదురు చూస్తున్నామని అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..