AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KVP VS VH : నన్ను తెలంగాణ వాడిలా చూడండి.. నువ్వు మాకొద్దు ఆంధ్రకు వెళ్ళిపో

Telangana News: కేవీపీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ. హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేవీపీ చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విభజన వద్దని ప్లకార్డులు పట్టుకున్నప్పుడు కేవీపీకి తెలంగాణ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు వీహెచ్‌. అవును, కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు అలియాస్ వీహెచ్ రూటే సెపరేటు. ఆయన దృష్టిలో పడ్డారంటే చాలు.. ఎవరైనా ఏకిపారేస్తారు. చిన్నా, పెద్దా.. చుట్టమా గిట్టమా అవన్నీ ఆయనకు జాన్తా నై.

KVP VS VH : నన్ను తెలంగాణ వాడిలా చూడండి.. నువ్వు మాకొద్దు ఆంధ్రకు వెళ్ళిపో
V Hanumantha Rao
TV9 Telugu
| Edited By: Shiva Prajapati|

Updated on: Sep 04, 2023 | 4:37 AM

Share

కేవీపీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ. హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేవీపీ చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విభజన వద్దని ప్లకార్డులు పట్టుకున్నప్పుడు కేవీపీకి తెలంగాణ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు వీహెచ్‌. అవును, కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు అలియాస్ వీహెచ్ రూటే సెపరేటు. ఆయన దృష్టిలో పడ్డారంటే చాలు.. ఎవరైనా ఏకిపారేస్తారు. చిన్నా, పెద్దా.. చుట్టమా గిట్టమా అవన్నీ ఆయనకు జాన్తా నై. నోటికాడికి వచ్చిన మాటను అలా అనేస్తారంతే. ఇక సొంత పార్టీవారా, అవతలి పార్టీ వారా అనేది కూడా ఆయన పెద్దగా పట్టించుకోరు. దుమ్ము దులపాలనుకుంటే దులిపేస్తారంతే. తాజాగా కేవీపీపై హాట్‌ కామెంట్స్‌ చేశారు వీహెచ్‌. ఇటీవల ఓ కార్యక్రమంలో కేవీపీ చేసిన వ్యాఖ్యలకు వీహెచ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

అసలు కేవీపీ ఏమన్నారంటే.. తెలంగాణలో కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు. అయితే తాను దశాబ్దాలుగా హైదరాబాదులోనే ఉంటున్నట్టు గుర్తు చేశారు. నన్ను కూడా తెలంగాణలో కలుపుకోండి అంటూ అక్కడున్న తెలంగాణ నాయకులను కోరారు కేవీపీ. కనీసం మొత్తం తెలంగాణ వాడిగా కలుపుకోకపోయినా సగం తెలంగాణ వాడిగా అయిన తనని చూడాలంటూ అక్కడ నవ్వులు పూయించారు. తన మరణం తర్వాత ఈ తెలంగాణ మట్టిలోనే కలిసిపోతానని కేవీపీ చెప్పుకొచ్చారు. అలా తాను తెలంగాణకు చెందిన వాడినేనని.. తనను ఆంధ్రా వాడు అనుకోవద్దని, తన ఓటు కూడా తెలంగాణలోనే ఉందన్నారు. ఈ కామెంట్స్‌పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు వద్దామనుకునే ఆలోచనను కేవీపీ రామచంద్రరావు మానుకోవాలని వీహెచ్ సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విభజన వద్దని ప్లకార్డులు పట్టుకున్నప్పుడు కేవీపీకి తెలంగాణ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని.. కాబట్టి కేవీపీ ఏపీ వెళ్లి పని చేస్తే బెటర్ అని సూచించారు.

రేవంత్, భట్టి విక్రమార్క సంయుక్త నాయకత్వంలో తెలంగాణలో అధికారులకు వస్తామనిచ అన్ని బాగున్న వేదిక మీదకు తాను ఎందుకని ప్రశ్నించారు. అయితే ఈ పంచాయతీ చూసిన వారు ఈ దశాబ్దాల వైరాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నప్పుడు వి హనుమంతరావు ఆయనతో చాలా సందర్భాల్లో వివేధించేవారు. అలాంటి సమయంలోనే కేవీపీ తో కూడా వీ హనుమంతరావుకు సఖ్యత ఉండేది కాదు. మొత్తానికి చాలా రోజుల తర్వాత ఇద్దరి మాటలు విని నాటి రోజులు గుర్తు చేసుకుంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు.

ఇవి కూడా చదవండి

ఇటీవల జరిగిన ‘రైతే రాజైతే…’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేవీపీతోపాటు రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. అదే వేదికపై కేవీపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 21వ శతాబ్దంలో వైఎస్సార్‌ ఒక్కరే, కేవీపీ ఒక్కరే అంటూ రేవంత్‌ రెడ్డి కామెంట్స్‌ చేశారు. రేవంత్‌ అలా.. వీహెచ్‌ ఇలా.. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత కేవీపీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..