AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Effect: దంచి కొడుతున్న వానలు.. ఆగమైన అన్నదాతలు.. పంటలకు ఊహించని నష్టం..

పంట వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చేవరకు, చిన్నపాటి యుద్ధాన్ని చేసే రైతన్న.. తీరా పంట చేతికి వచ్చాక దళారుల దగ్గర పోరాడలేక ఓడిపోతున్నాడు. తాజాగా అకాల వర్షాలు రైతన్నను నిండా ముంచేస్తున్నాయి. చేతికందొచ్చిన పంట కళ్లెదుటే మట్టిపాలు కావడంతో గుండెలు బాదుకుంటున్నారు అన్నదాతలు. ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో భోరుమంటున్నారు.

Rain Effect: దంచి కొడుతున్న వానలు.. ఆగమైన అన్నదాతలు.. పంటలకు ఊహించని నష్టం..
Rain Effect
G Peddeesh Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: May 17, 2024 | 5:19 PM

Share

పంట వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చేవరకు, చిన్నపాటి యుద్ధాన్ని చేసే రైతన్న.. తీరా పంట చేతికి వచ్చాక దళారుల దగ్గర పోరాడలేక ఓడిపోతున్నాడు. తాజాగా అకాల వర్షాలు రైతన్నను నిండా ముంచేస్తున్నాయి. చేతికందొచ్చిన పంట కళ్లెదుటే మట్టిపాలు కావడంతో గుండెలు బాదుకుంటున్నారు అన్నదాతలు. ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో భోరుమంటున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పెద్దఎత్తున ధాన్యం వర్షార్పణమైంది. వానల నుంచి పంటను కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు రైతులు.

దంచికొడుతున్న వానలు అన్నదాతలను నట్టేట ముంచాయి..నోటి కాడి బుక్క నీటిపాలడంతో రైతన్నలు దిగులుతో తలలు పట్టుకుంటున్నారు. కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం వరదల్లో కొట్టుకుపోతుంటే, రైతన్న గుండె చెరువు అవుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో గతవారం రోజుల నుండి కురుస్తున్న వడగండ్ల వానల ప్రభావంతో వివిధ పంటలకు ఊహించిన విధంగా నష్టం వాటిల్లింది. వేసవిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం అన్నదాత గుండె చేరువయ్యేలా చేసింది.

కరువు మేఘాలు వెక్కిరిస్తున్నా కష్టాలకు ఎదురీది పంటలు సాగు చేసిన రైతులు ఇప్పుడు తల్లడిల్లిపోతున్నారు.. పగబట్టిన ప్రకృతి రైతులు కుమిలి పోయేలా చేస్తోంది. చేతికి వచ్చిన పంట అమ్ముకునే సమయంలో దరిద్రపుగొట్టు వర్షాలు అన్నదాతలను నట్టేట ముంచాయి. వడగండ్ల వానలు రైతులకు ఊహించని విధంగా నష్టాన్ని కలిగిస్తున్నాయి. వడగండ్ల వానల ప్రభావంతో వరి పంటకు ఊహించని విధంగా నష్టం వాటిల్లింది..వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వరి పంట మొత్తం వర్శర్పణమైంది..

ఇప్పటికే కోతలు పూర్తయి అమ్మకం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.. చాలా ప్రాంతాల్లో కల్లాల్లో దాన్యం ఆరబోసుకొని అమ్ముకోవడానికి ఎదురుచూస్తున్నారు. మరి కొంతమంది రైతులు రోడ్లపై దాన్యం ఆరబోసుకుని అమ్ముకోవడానికి కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. వడగండ్ల వానల నుండి పంటను కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

పార్లమెంట్ ఎన్నికల కారణంగా ధాన్యం కొనుగోలులో కొంత అంతరాయం ఏర్పడింది. ఆ జాప్యం ఇప్పుడు రైతుల గుండె చేరువయ్యాలా చేస్తోంది. చేతికొచ్చిన పంట వర్షార్పరం అయిపోతుండడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. అక్కడా.. ఇక్కడన్న తేడా లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దడంతో రైతులు తల్లడిపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

మరోవైపు మామిడి పంటకు కూడా ఇదే రకమైన పరిస్థితి నెలకొంది ఈదురుగాళ్ల ప్రభావంతో మామిడిపాటంతా నేలరాలిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు.. మిర్చి పంట కూడా దాదాపుగా తుడిచి పెట్టుకుపోతుంది. కళ్ళాల్లో ఆరబోసిన మిర్చి పంటoతా తడిసి ముద్దమవడంతో రైతులు దిగులుతో తలలు పట్టుకున్నారు. వడగండ్ల వాన ప్రభావంతో తీవ్ర నష్టాన్ని చూసిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు వర్షాల ప్రభావంతో ఏర్పడే ఇబ్బందుల నుండి ప్రజలను రక్షించడం కోసం వరంగల్ నగరంతో పాటు జిల్లా కేంద్రాలలో అధికారులు టోల్ ఫ్రీ నెంబర్లను ప్రకటించారు అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…