మున్నూరు రవి పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! ఆస్పత్రిలో చికిత్స..

గాయపడిన రవిని వెంటనే మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజకీయంగా ఎదుగుతున్న తన బిడ్డపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు హత్యాయత్నానికి పాల్పడ్డాడని తన కొడుకుకు ఏం జరిగినా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కారణమని రవి తల్లి ఆరోపిస్తున్నారు. అయితే,

మున్నూరు రవి పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! ఆస్పత్రిలో చికిత్స..
Attack On Munnur Ravi
Follow us
Jyothi Gadda

|

Updated on: May 08, 2023 | 6:43 AM

మహబూబ్‌నగర్‌లో మున్నూరు రవిపై దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో రవి చేతికి, ముక్కుకు గాయాలుకావటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. రాత్రి పది గంటల సమయంలో మైత్రి ప్రింటింగ్‌ ప్రెస్‌ దగ్గర ఈ ఘటన జరిగింది. మున్నూరు రవిపై నలుగురు వ్యక్తులు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. ముందు పిడిగుద్దులు, తర్వాత రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలోనే రవిని రక్షించే ప్రయత్నం చేశారు స్థానికులు. గాయపడిన రవిని వెంటనే మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, తనపై జరిగిన దాడికి కారణం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తమ్ముడిపనే అని మున్నూరు రవి బంధువులు ఆరోపిస్తున్నారు. అసలు ఇంతకు ఈ మున్నూరు రవి ఎవరు..?

ఆదివారం రాత్రి రాత్రి పది గంటల ప్రాంతంలో మున్నూరు రవిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మహబూబ్‌నగర్‌లో తెలంగాణ చౌరస్తాలోని మైత్రి ప్రింటింగ్ ప్రెస్ దగ్గర కూర్చొని ఉండగా, ఆకస్మాత్తుగా వచ్చిన నలుగురు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు షాపు ముందు కుర్చీలో కూర్చున్న రవిని ఈడ్చుకుంటూ వెళ్లి ఇష్టానుసారంగా కొట్టరు. ప్రాణభయంతో పక్కనే ఉన్న ఇంట్లోకి పరిగెత్తాడు రవి. పరుగెత్తుతున్న సమయంలో ఆ నలుగురు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. అక్కడే ఉన్న వారు ముందు రవిని కాపాడే ప్రయత్నం చేశారు. దీంతో ఆ నలుగురు వ్యక్తులు పరారయ్యారు.

గాయాలైన మున్నూరు రవిని అతని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తనను చంపించడానికి విరసనోళ్ల శ్రీకాంత్ గౌడ్ మనుషులను పంపించాడని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాజకీయంగా ఎదుగుతున్న తన బిడ్డపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు హత్యాయత్నానికి పాల్పడ్డాడని తన కొడుకుకు ఏం జరిగినా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కారణమని రవి తల్లి ఆరోపిస్తున్నారు. అయితే, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నారు మున్నూరు రవి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..