Minor Couple: బాసరలో పెళ్లి చేసుకోవడానికి వచ్చిన మైనర్లు.. పోలీసుల అదుపులో మైనర్ జంట

యువత ప్రేమ పేరుతో ఆకర్షితులవుతున్నారు. దీనికి తోడు సెల్‌ఫోన్లు ప్రేమికులను మరింత చేరువ చేస్తున్నాయి. చాటింగ్, వాట్సాప్‌ కాల్, వీడియో కాల్‌తో ప్రేమికులు నిత్యం కలుసుకునే వీలుగా ఉంటుంది. దీంతో పట్టుమని పద్దెనిమిదేళ్లు నిండక ముందే ప్రేమ పేరుతో కొందరు టీనేజర్లు ఊహల లోకంలో విహరిస్తున్నారు.

Minor Couple: బాసరలో పెళ్లి చేసుకోవడానికి వచ్చిన మైనర్లు.. పోలీసుల అదుపులో మైనర్ జంట
Minor Couple
Follow us
Surya Kala

|

Updated on: May 08, 2023 | 6:49 AM

ఇద్దరు మైనర్ల ప్రేమ కథ.. సినిమా కథను మించిపోయింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకోవడానికి చేసుకోవడానికి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేశారు. అయితే ఈ ప్రేమ్‌ కహనీకి పోలీసులు క్లైమాక్స్‌ రాశారు. నిర్మల్‌ జిల్లా బాసరలో పెళ్లి చేసుకోవడానికి మైనర్ల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. వాస్తవానికి సినిమాల ప్రభావం నేటి యువతరం మీద ఎక్కువ ఉంది. ప్రేమ అనే అంశం లేకుండా సినిమాలు ఉండటం లేదు. వీటిని చూసిన యువత ప్రేమ పేరుతో ఆకర్షితులవుతున్నారు. దీనికి తోడు సెల్‌ఫోన్లు ప్రేమికులను మరింత చేరువ చేస్తున్నాయి. చాటింగ్, వాట్సాప్‌ కాల్, వీడియో కాల్‌తో ప్రేమికులు నిత్యం కలుసుకునే వీలుగా ఉంటుంది. దీంతో పట్టుమని పద్దెనిమిదేళ్లు నిండక ముందే ప్రేమ పేరుతో కొందరు టీనేజర్లు ఊహల లోకంలో విహరిస్తున్నారు.

చదువు, ఉద్యోగం.. జీవితంలో నిలదొక్కుకోవడం వంటి విషయాలను పక్కన పెట్టి ప్రేమాయణం సాగిస్తున్నారు. దీంతో తెలిసీతెలియని వయసులో యువతీయువకులు ప్రేమించుకోవడం. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం సహజంగా జరుగుతుంటాయి. వీళ్లు కూడా ఆ వయసులో కలిగే ఆకర్షణను వారిద్దరూ ప్రేమగా భావించారు. తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించరని భావించి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేశారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇద్దరి మతాలు వేరు వేరు కావడంతో స్థానికులకు వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. వారు ఇచ్చే సమాధానాలు కూడా తేడాగా ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే