Gold Price Today: గోల్డ్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర. ఈరోజు ఎంతంటే..

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఓ రేంజ్‌లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. తులం బంగారం ధర ఇప్పటికే రూ. 60 వేలు దాటేసింది. ఇక తాజాగా మళ్లీ పెళ్లి ముహుర్తాలు ఉండడంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో బంగారం ధరలో తగ్గుదల కనిపించడం...

Gold Price Today: గోల్డ్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర. ఈరోజు ఎంతంటే..
Gold Price Today
Follow us
Narender Vaitla

|

Updated on: May 08, 2023 | 6:17 AM

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఓ రేంజ్‌లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. తులం బంగారం ధర ఇప్పటికే రూ. 60 వేలు దాటేసింది. ఇక తాజాగా మళ్లీ పెళ్లి ముహుర్తాలు ఉండడంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో బంగారం ధరలో తగ్గుదల కనిపించడం గోల్డ్‌ లవర్స్‌కి కాస్త ఊరటనిస్తోంది. ఆదివారం తులం బంగారంపై ఏకంగా రూ. 760 వరకు తగ్గగా తాజాగా సోమవారం కూడా బంగారం ధరలో తగ్గుదుల కనిపించింది. అయితే ఈరోజు తులంపై కేవలం రూ. 10 మాత్రమే తగ్గింది. మే8వ తేదీన దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.56,640 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,780గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.56,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,630 ఉంది.

ఇవి కూడా చదవండి

* బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.56,540 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,630 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,630 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,490 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,630 వద్ద కొనసాగుతోంది.

* విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,630 ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే:

ఇక దేశీయంగా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.82,400, ముంబైలో రూ.77,700, ఢిల్లీలో రూ.77,700, కోల్‌కతాలో కిలో వెండి రూ.77,700, బెంగళూరులో రూ.82,400, హైదరాబాద్‌లో రూ.82,400, విజయవాడలో రూ.82,400 విశాఖలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..