జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసినా తగ్గని హీట్.. టీఆర్ఎస్ నాయకురాలి ఇంటిపై దుండగుల దాడి..

జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసి చాలా రోజులు గడుస్తున్నా.. దాని తాలూకు ఎఫెక్ట్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజేంద్రనగర్‌లో టీఆర్ఎస్..

  • Shiva Prajapati
  • Publish Date - 1:25 pm, Sun, 20 December 20
జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసినా తగ్గని హీట్.. టీఆర్ఎస్ నాయకురాలి ఇంటిపై దుండగుల దాడి..

జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసి చాలా రోజులు గడుస్తున్నా.. దాని తాలూకు ఎఫెక్ట్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజేంద్రనగర్‌లో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య దాడుల పరంపర నడుస్తూనే ఉంది. ఆదివారం నాడు మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకనగర్‌లో టీఆర్ఎస్ మహిళా నాయకురాలు చైనత్య రెడ్డిపై గుర్తు తెలియని దుండగులు దాడికి తెగబెడ్డారు. ఈ ఘటనలో చైతన్య రెడ్డికి గాయాలయ్యాయి. ఇంట్లోని ఫర్నిచర్ మొత్తం ధ్వంసం అయ్యింది. తన ఇంటిపై బీజేపీ శ్రేణులే దాడులకు పాల్పడ్డారని చైతన్య రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆమేరకు మైలార్‌దేవుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైతన్య రెడ్డి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ఆ దిశగా దర్యాప్తును చేపట్టారు. ఆమె ఇంటిపై దాడి చేసిన దుండగులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. కాగా, బీజేపీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం ఆ ఘటన మొదలు ఇప్పటి వరకు ఐదసార్లు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఘర్షణలు జరిగాయి. ఇరు పార్టీల నేతలు పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు. అయితే పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇరు పార్టీల వారు సంయమనం పాటించాలని హితవుచెబుతున్నారు.

Also read:

క్రిస్మస్ టైం : ఆసియాలోనే అతి పెద్ద సియస్ఐ చర్చి, పర్వదిన సమయాన కొత్తశోభతో అలరారుతోన్న మెదక్

MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరుకు బీజేపీ సిద్ధం.. అభ్యర్థులు ఖరారు..!