AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Kishan Reddy: కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు.. తెలంగాణ సర్కారు అలసత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్‌ ఆర్‌ పరిధిలో రైల్‌ ప్రాజెక్ట్‌ రానుంది ఈ రోడ్డు నిర్మాణం కోసం భూ సేకరణ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. సగం నిధులు ఇస్తామని కేంద్రం ముందుకు వచ్చినా.. పనులు వేగవంతం చేయడం లేదన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు రూ. 300కోట్లతో ఎంఎంటీఎస్‌ నిర్మించబోతున్నాట్లుగా తెలిపారు.

Minister Kishan Reddy: కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు.. తెలంగాణ సర్కారు అలసత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం
Union Minister Kishan Reddy
Sanjay Kasula
|

Updated on: Aug 06, 2023 | 11:56 AM

Share

రైల్వే ప్రాజెక్టులతోపాటు 2407 కిలోమీటర్ల పొడువగల మరో 33 ప్రాజెక్టులను కూడా సర్వేజరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా నాంపల్లి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేశారు. ప్రమాదాలను అరికట్టడంతోపాటు స్వదేశీ పరిజ్జానంతో టెక్నాలజీ అయిన కవచ్‌ని డెవలప్ చేసినట్లుగా తెలిపారు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలతోపాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాం. రైల్వే ప్రయాణికులు ఒక ప్లాట్ ఫాం మీది నుంచి మరో ఫ్లాట్ ఫాం మీదికి వెళ్లడానికి 38 ఫుట్ ఓర్ బ్రిడ్జిలను తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. పేదవాడు, ఉద్యోగస్తుల రైలుగా పేరున్న ఎంఎంటీఎస్ మరింత వేగం పెంచేందుకు మొదలు పెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లభించనప్పటికీ.. తెలంగాణలో అతిపెద్ద దేవాలాయం యాదాద్రికి వెళ్లే భక్తుల సౌలభ్యం కోసం ఎంఎంటీఎస్ రైళ్లను పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రూ. 350 కోట్లతో హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ నిధులను మంజూరు చేశారని తెలిపారు.

హైదరాబాద్‌లో మొత్తం మూడు రైల్వే స్టేషన్లకు అదనంగా చర్లపల్లి రైల్వే స్టేషన్‌ టర్మనల్ పనులు ప్రారంభమవుతున్నాయని అన్నారు. ఈ ఏడాది చివరినాటికి దాదాపు పూర్తిచేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేయనున్నామని అన్నారు. ఇందు కోసం ఇప్పటికే రూ. కోట్ల అందిచినట్లుగా కేంద్ర కిషన్ రెడ్డి తెలిపారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ తోపాటు కాచిగూడ రైల్వే స్టేషన్‌ను అభివృద్ది చేస్తున్నామన్నారు. ట్రిపుల్‌ ఆర్‌ పరిధిలో రైల్‌ ప్రాజెక్ట్‌ రానుందన్నారు. రోడ్డు నిర్మాణం కోసం భూ సేకరణ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని విమర్శించారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. సగం నిధులు ఇస్తామని కేంద్రం ముందుకు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం పనులు వేగవంతం చేయడం లేదని అన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.

దేశంలో రద్దీ ఎక్కువగా ఉండే రైల్వేస్టేషన్లను మరింత ఆధునికీకరించే టార్గెట్‌తో కేంద్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా ప్రధనమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ 508 రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌లో 55, బిహార్‌ 49, మహారాష్ట్ర 44, పశ్చిమబంగాల్‌ 37, మధ్యప్రదేశ్‌ 34, అసోం 32, ఒడిశా 25, పంజాబ్‌ 22, గుజరాత్‌, తెలంగాణ 21, ఝార్ఖండ్‌ 20, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు 18, హరియాణా 15, కర్ణాటకలో 13 రైల్వే స్టేషన్లను ప్రారంభిచారు.

ఈ పథకంలో భాగంగా స్పషల్ రైల్వే స్టేషన్లో ఉన్న మౌలిక సదుపాయాల ఆధునీకరించనున్నారు. తెలంగాణలో అభివృద్ధి చేసే 21 స్టేషన్లకు 894 కోట్లు కేటాయించారు. హైదారబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులను వర్చువల్‌​గా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం