AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah: టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎప్పుడైనా ఒక్కటవుతాయి.. బీజేపీ కోర్‌ కమిటీ భేటీలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

Telangana BJP core committee meeting: తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై నేతలకు ప కీలక సూచనలు చేశారు.

Amit Shah: టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎప్పుడైనా ఒక్కటవుతాయి.. బీజేపీ కోర్‌ కమిటీ భేటీలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
Amit Shah
Shaik Madar Saheb
|

Updated on: Sep 17, 2022 | 3:05 PM

Share

Telangana BJP core committee meeting: తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah).. రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై నేతలకు కీలక సూచనలు చేశారు. పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి  అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీంతోపాటు పలు కీలక అంశాలపై మాట్లాడారు. అనంతరం అమిత్‌ షా.. తెలంగాణలోని బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. హరిత ప్లాజాలో జరిగిన బీజేపీ తెలంగాణ కోర్‌ కమిటీ సమావేశంలో.. అమిత్ షా రాష్ట్రంలో బీజేపీ బలోపేతం, పలు అంశాలపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయడంతోపాటు పలు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి గురించి, మునుగోడు ఉప​ఎన్నికపై చర్చించి.. పలు సూచనలు చేశారు.

2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పొత్తు ఉండొచ్చంటూ అమిత్‌షా పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎప్పుడైనా ఒక్కటవుతాయనే విషయాన్ని ప్రజలకు మరింత క్లియర్‌గా అర్థం కావలని.. దీనిపై కార్యచర్యణ రూపొందించి తెలియజెప్పాలంటూ సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ సీన్‌ నుంచి అవుట్ అయిందన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటానని.. మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ పెంచాలని రాష్ట్ర నేతలకు సూచించారు.

నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై ఆరా తీసిన షా.. గతంలో ఇచ్చిన కార్యక్రమాల ఫీడ్ బ్యాక్ అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా.. తెలంగాణలో ఇప్పటి వరకు బీజేపీ గెలవని 19 ఎంపీ స్థానాల గురించి చర్చించి పలు సూచనలు చేశారు. పార్టీలో ఐక్యత అవసరమని.. బుత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళిక రచించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!