మీకు చేతులెలా వచ్చాయ్‌రా.. తెల్లారి పోలానికి వెళ్లి కంటతడి పెట్టిన రైతులు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ గ్రామంలో అర్ధరాత్రి ముగ్గురు రైతులకు చెందిన మిర్చి నారు పై గుర్తు తెలియని దుండగులు గడ్డి మందు పిచికారి చేశారు.. సులానగర్ గ్రామంలో ముగ్గురు రైతులు కలసి తమ పొలంలో మిర్చి నారు వేసి పెంచుతున్నారు..

అయ్యో.. ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతులకు ఎంత కష్టం.. ఎంత నష్టం కలిగిందో చూడండి.. తెల్లారే సరికి పొలానికి వెళ్ళి చూసిన రైతులు షాక్ గురయ్యారు.. ఎవరో గుర్తు తెలియని దుండగులు చేసిన పనికి రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు.. వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ గ్రామంలో అర్ధరాత్రి ముగ్గురు రైతులకు చెందిన మిర్చి నారు పై గుర్తు తెలియని దుండగులు గడ్డి మందు పిచికారి చేశారు.. సులానగర్ గ్రామంలో ముగ్గురు రైతులు కలసి తమ పొలంలో మిర్చి నారు వేసి పెంచుతున్నారు.. గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి నారుపై గడ్డి మందు పిచికారి చేయడంతో మిర్చి నారు మొత్తం కాలిపోయింది.
అజ్మీర వీరన్న అనే రైతు 70 మిర్చి విత్తనాల ప్యాకెట్లు. అజ్మీరా హటియా 80 ప్యాకెట్లు. కందుకూరి రాములు 50 మిర్చి ప్యాకెట్లు కలిసి ఒకే దగ్గర విత్తనాల నారు పోశారు.. 15 రోజులు కావడంతో పోసిన విత్తనాలు మొత్తం మంచిగా రెండు ఇంచుల మేర మొలకవేత్తడంతో సంతోషపడ్డారు. చేతికి అందుతున్న సమయంలో రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి. నీళ్లు చల్లడానికి పంట చేనుకు వెళ్లి చూడగా మొత్తం మాడిపోయి కనిపించాయి..
వీడియో చూడండి..
నిన్నటి వరకు పచ్చగా ఏపుగా పెరిగి కనిపించిన మర్చి పైరు మొత్తం ఎండి పోయింది. ఇది చూసి రైతులు లబోదివోమంటూ కన్నీరు పెట్టుకున్నారు.. గడ్డి మందు చల్లినట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని వేసిన నారుని పరిశీలించి రైతుల ద్వారా కంప్లైంట్ తీసుకొని గుర్తుతెలియని వ్యక్తుల కోసం విచారణ చేపట్టారు.
రెండు లక్షల రూపాయలు విలువచేసే మిర్చి ప్యాకెట్లు కొనుగోలు చేసి నారు పోసామని.. నారు మొలిచేసరికి గుర్తు తెలియని వారు గడ్డి మందు పోసి కాలిపోయేలా చేశారని రైతులు వాపోయారు. దుండగులను గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని.. ఇప్పటివరకు ఖర్చు చేసిన డబ్బులను ఇప్పించాలని కోరారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




