Betting Apps Case: గూగుల్, మెటాకు ఈడీ నోటీసులు… ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో విచారించనున్న ఈడీ
బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తును ఈడీ అధికారులు స్పీడప్ చేశారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలకు నోటీసులు జారీ చేసిన ఈడీ.. తాజాగా టెక్ దిగ్గజాలు గూగుల్, మెటాకు సమన్లు పంపారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో గూగుల్, మెటాలను విచారించనుంది ఈడీ...

బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తును ఈడీ అధికారులు స్పీడప్ చేశారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలకు నోటీసులు జారీ చేసిన ఈడీ.. తాజాగా టెక్ దిగ్గజాలు గూగుల్, మెటాకు సమన్లు పంపారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో గూగుల్, మెటాలను విచారించనుంది ఈడీ. ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్, షేర్‌చాట్, స్నాప్‌చాట్ ఇలా ఏ యాప్ ట్రెండింగ్‌లో ఉంటే.. అందులో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారు సెలబ్రిటీలు. ఈ క్రమంలో విచారణలో భాగంగా గూగుల్, మెటాకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
బెట్టింగ్ యాప్‌లతో మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసింది. అయినప్పటికీ.. గూగుల్, మెటా సంస్థలు ఇలాంటి యాప్‌లను తమ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయనేది ఈడీ ఆరోపణ. ఈ టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే గాక, వెబ్‌సైట్ల లింక్‌లను కూడా అందుబాటులో ఉంచుతున్నాయని ఈడీ పేర్కొంది.
తెలంగాణలో బెట్టింగ్స్ యాప్స్ వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. జూదాన్ని విచ్చలవిడిగా ప్రమోట్ చేయడంతో.. ప్రజలు కూడా ఆకర్షితులై.. వాటిలో డబ్బులు పెట్టి నష్టపోయారు. కొందరు లక్షలాది రూపాయలు కోల్పోయారు. దీంతో బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ప్రమోటర్స్‌గా ఉన్న సినీ సెలెబ్రిటీలు, యూట్యూబర్స్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ECIR నమోదు చేసింది. ఇది పోలీసులు నమోదు చేసే ఎఫ్‌ఐఆర్ లాంటిదే. బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ చేసినందుకు కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఈడి గుర్తించి ఈసీఐఆర్ నమోదు చేసింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడి దర్యాప్తు చెయ్యనుంది.
ఇప్పటికే టాలీవుడ్ నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, అనన్య నాగళ్ల, నిధి అగర్వాల్, మంచు లక్ష్మీ, శ్రీముఖి వంటి వారిపై ఈడీ కేసుని నమోదు చేసి విచారణ చేస్తోంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న 29మంది సెలెబ్రిటీలు, యూట్యూబర్స్ మీద ఈడీ విచారణ జరపనుంది. గతంలో వీరిపై సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫిర్యాదులు అందాయి.




