Hyderabad: దంచికొట్టిన వర్షం.. దెబ్బకు మునిగిన ఫ్లైఓవర్.. వీడియో చూశారా!
శుక్రవారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌నగరం తడిసి ముద్దైంది. సుమారు మూడు-నాలుగు గంటల పాటు కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లోని కాలనీలు చెరువులను తలపించాయి. కొన్ని లోతట్లు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. సుమారు నడుముల లోతు మేర కాలనీల్లోకి నీరు చేరడంతో స్థానిక ప్రజలు, నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
శుక్రవారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌నగరం తడిసి ముద్దైంది. సుమారు మూడు-నాలుగు గంటల పాటు కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లోని కాలనీలు చెరువులను తలపించాయి. కొన్ని లోతట్లు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. సుమారు నడుముల లోతు మేర కాలనీల్లోకి నీరు చేరడంతో స్థానిక ప్రజలు, నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయంగా మారాయి. కొత్తగూడ-హాఫీజ్‌పేట్ ప్లైఓవర్‌పై ఏకంగా నడుముల్లోతు నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ నీటిలోంచి ముందుకు వెళ్లలేక చాలా సేపు ఫ్లైబర్‌పైనే ఆగిపోయారు. వర నీరు కాస్త తగ్గిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. వర్షం కారణంగా ప్రధాన ప్రాంతాలైన మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి ఐకియా గుండా హటెక్ సిటీ వెళ్లే మార్గంలో చాలా సేపు వాహనాలు రోడ్లపై ట్రాఫిక్‌లోనే నిలిచిపోయాయి. హైటెక్ సిటీ నుంచి కేపీహెచ్‌బీ మార్గంలోని ఫ్లైఓవర్‌పై సైతం భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ఇక్కడే కాకుండా, మియాపూర్-గచ్చిబౌలి, గచ్చిబౌలి- టౌలిచౌకి, వంటి మార్గాల్లో కూడా గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది.జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు రంగంలోకి దిగి వరధ నీటిని తొలగించడం వల్ల కొన్ని ప్రాంతాల్లోని ట్రాఫిక్ సమస్య తగ్గింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

