Nalgonda: నాగార్జునసాగర్ దగ్గర కనిపించిన అరుదైన దృశ్యం.. దాన్ని చూసి పర్యాటకులు స్టన్.!
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ జలాశయంలో నీటి కుక్కలు సందడి చేసాయి. అటు భూమి మీద ఇటు నీటిలో ఉండగలిగే ఉభయ చరాల్లో నీటికుక్కలు కూడా ఒకటి. అరుదుగా కనిపించే నీటి కుక్కలు నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో దర్శనమిచ్చాయి. సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో అరుదుగా కనిపించే జీవులు ఈ నీటికుక్కలు.
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ జలాశయంలో నీటి కుక్కలు సందడి చేసాయి. అటు భూమి మీద ఇటు నీటిలో ఉండగలిగే ఉభయ చరాల్లో నీటికుక్కలు కూడా ఒకటి. అరుదుగా కనిపించే నీటి కుక్కలు నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో దర్శనమిచ్చాయి. సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో అరుదుగా కనిపించే జీవులు ఈ నీటికుక్కలు. జలాశయంలో నీటి కుక్కలు కలియతిరుగుతూ వీక్షకులకు కనువిందు చేసాయి. సాగర్ లోని వీఐపీ శివాలయం పుష్కర ఘాట్ వద్ద నీటి కుక్కలు కనిపించడంతో సందర్శకులు పెద్ద ఎత్తున ఫొటోలు, వీడియోల్లో వాటిని బంధించారు. కనుమరుగైపోతున్న జాతుల్లో నీటి కుక్కలు కూడా ఒకటి. రెండేళ్ళ క్రితం ఒకసారి సాగర్ జలాల్లో నీటి కుక్కలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఆ తర్వాత కాలంలో రిజర్వాయర్ లో అవి కనిపించకుండా పోయాయి. తాజాగా సాగర్ జలాల్లో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలోనే నీటి కుక్కలు జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు.
నీటికుక్కలను చూసేందుకు ముంగిస లాంటి తల, సీల్ చేపను పోలిన మెడను కలిగి ఉంటాయి. ఇవి ఒకరకమైన క్షీరదాలు. దీనికి శాస్త్రీయ నామం అట్టర్. పెద్దగా అలికిడి లేని నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇవీ సరిసృపాలు.. ఇవి నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకుంటాయని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నీటికుక్కలకు చెందిన 13 జాతులు, 7 ప్రజాతులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. అయితే, కొంతకాలంగా వీటి సంఖ్య వేగంగా తగ్గిపోతోందనీ జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ఉప్పల పాడు పక్షుల కేంద్రంలో నీటికుక్కలను గుర్తించగా తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి కుక్కలు దర్శనమిచ్చాయి. అంతరించి పోతున్న అరుదైన జాతి కావటంతో వీటిని సంరక్షించాలని పర్యాటకులు, జంతు ప్రేమికులు కోరుతున్నారు.