Telangana: చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు యువకుల్ని చెట్టుకి కట్టేసిన గ్రామస్థలు.. చివరికి ?
రోజురోజుకు సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. విజ్ఞానాన్ని వినియోగించుకుంటూ చంద్రునిపై నివాసం ఏర్పరుచూకునేందుకు కూడా ఓ వైపు మానవుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే మరోవైపు మాత్రం ప్రజల్లో ఇంకా మూఢనమ్మకాలు పోవడం లేదు. ఇప్పటికీ కూడా చేతబడి చేస్తామంటూ జనాల్ని నమ్మించేవాళ్లు ఉండటాన్ని చూస్తే ఆశ్యర్యం కలగక మానదు. తాజాగా మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలంలోని పాపీయ తండాలో ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడ ఇద్దరు యువకలు చేతబడి చేస్తున్నారనే అనుమానం రావడంతో.. ఆ గ్రామస్థులు వారిద్దరిని చెట్టుకు కట్టేశారు.
రోజురోజుకు సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. విజ్ఞానాన్ని వినియోగించుకుంటూ చంద్రునిపై నివాసం ఏర్పరుచూకునేందుకు కూడా ఓ వైపు మానవుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే మరోవైపు మాత్రం ప్రజల్లో ఇంకా మూఢనమ్మకాలు పోవడం లేదు. ఇప్పటికీ కూడా చేతబడి చేస్తామంటూ జనాల్ని నమ్మించేవాళ్లు ఉండటాన్ని చూస్తే ఆశ్యర్యం కలగక మానదు. తాజాగా మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలంలోని పాపీయ తండాలో ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడ ఇద్దరు యువకలు చేతబడి చేస్తున్నారనే అనుమానం రావడంతో.. ఆ గ్రామస్థులు వారిద్దరిని చెట్టుకు కట్టేశారు. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. పెద్ద చింతకుంటకి అనే గ్రామానికి చెందిన కాట్రోత్ భాస్కర్, నూనావత్ భాస్కర్ అనే ఇద్దరు వ్యక్తులు చుట్టపు చూపుగా పాపీయ తండాకు వచ్చారు.
అయితే గురువారం రోజున రాత్రికి పాపీయ తండాలో తిరుగుతూ.. చాలా ప్రదేశాల్లో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, పచ్చిమిర్చి లాంటివి వేశారు. అయితే వారిద్దరు అలా చేస్తుండగా.. ఆ గ్రామంలోని ఓ వక్తి గమనించాడు. దీంతో వెంటనే ఆ గ్రామస్థుల్ని నిద్ర లేపారు. ఈ విషయం తెలిసిన స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఆ గ్రామస్థులంతా ఏకమై వారిద్దరిని పట్టుకున్నారు. చివరికి ఓ చెట్టు వద్దకి తీసుకొచ్చి వారిని కట్టేశారు. వారి బంధువులు వదిలేయాలని బతిమిలాడినా కూడా చెట్టుకు కట్టేసే ఉంచారు. అయితే గ్రామ పెద్దలు.. ఊరిలో అలా పసుపు, కుంకుమ ఎందుకు చల్లారంటూ ప్రశ్నించారు. కానీ ఎంత అడిగినా కూడా ఆ యువకులు సమాధానం చెప్పలేదు. ఇక చివరికి వాళ్లు ఎక్కడెక్కడ పసుపు, కుంకుమలు చల్లారో ఆ ప్రాంతాలన్ని తిప్పి బలవంతగా వాటిని ఎత్తించారు. మరోవైపు ఆ యువకులు చేసిన చేతబడి వల్ల గ్రామంలో ఎవరికైనా హనీ జరుగుతుందేమోనని.. కొంతమది గ్రామస్థులు భయపడుతూ మాట్లాడుకున్న సన్నివేశాలు కనిపించాయి.
ఇదిలా ఉండగా.. చివరికి ఈ విషయంపై గ్రామస్థులను పోలీసులను ఆశ్రయించారు. రంగలోకి దిగిన పోలీసులు ఆ యువకులిద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అసలు మంత్రాలు, తంత్రాలు అనేవి ఉండవని గ్రామస్థులకు అవగాహన చేస్తున్నారు. ఇలాంటి వాటివల్ల ఎవరికీ ఎలాంటి హానీ జరగదని చెబుతున్నారు. మంత్రాలు, చేతబడులను నమ్మకూడదని ప్రజలు అవగాహన కల్పించారు. కాట్రోత్ భాస్కర్, నూనావత్ భాస్కర్‌లు తాము ఎలాంటి తప్పులు చేయలేదని చెప్పారు. బావ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చామని వివరించారు. రాత్రిపూట అలాగ్ గ్రామంలో తిరుగుతుండగా.. గ్రామస్థులు పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో కూడా ఇలా చేతబడులకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి మూఢనమ్మకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..