Siddipet: దుబ్బాకలో విషాద సంఘటన.. ప్రేమకు అంగీకరించలేని మైనర్ జంట ఆత్మహత్య
ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోవడం లేదంటూ ఇంటర్ చదువుతున్న మైనర్ జంట ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట గ్రామానికి చెందిన 17 ఏళ్ల కుర్రాడు ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో...
ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోవడం లేదంటూ ఇంటర్ చదువుతున్న మైనర్ జంట ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట గ్రామానికి చెందిన 17 ఏళ్ల కుర్రాడు ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోన్న అమ్మాయితో పరిచయం ఏర్పాడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గతేడాది నుంచి ఇద్దరు ప్రేమలో ఉన్నారు.
అయితే ఇటీవలే ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. వీరిద్దరూ మైనర్లు కావడంతో వీరి ప్రేమను ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. దీంతో మనస్థాపానికి గురై ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే లచ్చపేటలో అబ్బాయి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు ఇటీవలే లచ్చపేట నుంచి దుబ్బాకకు వచ్చి నివసిస్తున్నారు.. దుబ్బాకలో కిరాయి ఇంట్లో ఉంటున్నారు. ఈ ప్రేమ జంట లచ్చపేటలోని ఇంట్లో బుధవారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.. ఈ విషయం తెలుసుకున్న ఇరువురు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..