Hyderabad: వచ్చే 5 రోజులు వానలే వానలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు
తెలంగాణలో రానున్న 5 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా బుధవారం నుంచి 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణలో జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని..
తెలంగాణలో రానున్న 5 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా బుధవారం నుంచి 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణలో జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.
ఇక హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కరిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే తెంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు.
ఇదిలా ఉంటే భారీ వర్షాల కారణంగా ఉత్తర భారత దేశం అతలాకుతలమవుతోంది. భారీ వరదాల కారణంగా యమునా నది ఉగ్రరూపం దాల్చింది, ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్న యమునా నది. పాత రైల్వే బ్రిడ్జ్ పై వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు. వర్షాల నేపథ్యలో పలు రైళ్లు రద్దు మరికొన్ని దారిమళ్లించారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు ఉత్తరాది రాష్ట్రాల్లో 43 మంది మృతి చెందారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..