Ground Report On Mallepalli: ఆ”పరేషన్” మల్లేపల్లి.. అక్కడి పరిస్థితులపై టీవీ9 తెలుగు గ్రౌండ్ రిపోర్ట్

ఉగ్రవాదుల మూలాలు హైదరాబాద్ లో మళ్లీ టెన్షన్ రేపుతున్నాయి. ఒకప్పుడు పాతబస్తీకి పరిమితమైన స్లీపర్ సెల్స్ ఇప్పుడు నగర నడిబొడ్డులోనూ దుకాణం పెట్టేస్తునారు. నలుగురిలో కలిసిపోతూ...

Ground Report On Mallepalli: ఆపరేషన్ మల్లేపల్లి.. అక్కడి పరిస్థితులపై టీవీ9 తెలుగు గ్రౌండ్ రిపోర్ట్
Mallepalli
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 02, 2021 | 7:56 PM

(Vijay Saatha, టీవీ9 తెలుగు)

ఉగ్రవాదుల మూలాలు హైదరాబాద్ లో మళ్లీ టెన్షన్ రేపుతున్నాయి. ఒకప్పుడు పాతబస్తీకి పరిమితమైన స్లీపర్ సెల్స్ ఇప్పుడు నగర నడిబొడ్డులోనూ దుకాణం పెట్టేస్తునారు. నలుగురిలో కలిసిపోతూ నలుదిక్కులా కుట్రలు పన్నెలా వ్యుహరచన చేస్తున్నారు ఉగ్ర మూకలు. మాలిక్ సోదరుల అరెస్ట్ ల తర్వాత మరోసారి హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ స్థావరాలపై చర్చ మొదలైంది. దర్భంగా బ్లాస్ట్ కు వ్యూహ రచన పడిన మల్లేపల్లిలో అసలు ఏం జరుగుతుంది….

పాతబస్తిని మించిన బిల్డింగ్ లు

ఒకప్పుడు ఉగ్రవాదులకు , స్లీపర్స్ సెల్స్ కు హైదరాబాదులో స్థావరం అంటే ఒక పాత బస్తీనే . పాత బస్తీ కేంద్రంగా ఎంత మంది ఉగ్రవాదులు ఎన్నో దాడులకు మరెన్నో హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. అటువంటి ఓల్డ్ సిటీ పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదట్లో ను అనేక సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహించి పరిస్థితి కుదుటపెట్టారు. ఇక పాతబస్తీ పై పోలీసుల ఫోకస్ ఎక్కువ అవడంతో పందా మార్చారు స్లీపర్ సెల్స్.. వెస్ట్ జోన్ పరిధిలో ఉన్న మల్లేపల్లి ప్రాంతం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. దేశంలో ఎక్కడ ఏ ఉగ్ర దాడి జరిగినా, దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మూలాలు హైదరాబాద్ లో ఉండటం కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం.. రెండు వేల పన్నెండు నుండి నేటి వరకు మల్లేపల్లి కేంద్రంగా ఎంతో మంది స్లీపర్ సేల్స్ ను అరెస్టు చేసింది ఎన్ఐఏ. 2012 లో అబ్దుల్ రెహమాన్ అనే తీవ్రవాదిని ఇదే మల్లేపల్లి లో అరెస్ట్ చేశారు పోలీసులు. 2016లో ఐసిస్ పై ఆకర్షితుడై వెళ్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. 2018 లోనూ ఇదే మల్లేపల్లిలో మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు. ఈ విధంగా మొత్తం గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో ఆరుగురు ఉగ్రవాదులను ఇదే మల్లేపల్లి ప్రాంతం నుండి అధికారులు అరెస్టు చేసారు.

వస్త్ర వ్యాపారమే అడ్డాగా

స్లిప్పర్ సెల్స్ మల్లేపల్లినే ఎందుకు టార్గెట్ గా చేసుకుంటున్నారు అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఒకప్పటి మల్లేపల్లికి ఇప్పటి మల్లేపల్లికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది అంటున్నారు మల్లెపల్లి స్థానికులు. బతుకుతెరువు కోసం ఇక్కడికి వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు కొందరైతే అదేపనిగా దేశ భద్రతకు హాని కలిగించేలా చేయడానికి ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వారు కొందరు. ముఖ్యంగా మల్లేపల్లిలో బట్టల దుకాణాలు, ఫర్నిచర్ షాపులు ఎక్కువగా ఉండటం వాటిని ఆశ్రయంగా మలుచుకుని అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారు కొంతమంది స్లీపర్ సెల్స్. మల్లేపల్లి టోలి చౌకి ప్రాంతాల్లో ఇటువంటి వారు చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. కొంతమంది కొన్ని సంవత్సరాల కిందటే మల్లెపల్లిలో ఆశ్రయం పొందితే మరికొంతమంది వారిని ఆసరాగా తీసుకొని ఇక్కడికి వచ్చి ఉగ్ర కుట్రలు పన్నుతున్నారు

ఉలిక్క పడ్డ మల్లేపల్లి

తాజాగా మాలిక్ సోదరుల ఘటన చూసుకుంటే 20 సంవత్సరాల కిందటనే ఉత్తర ప్రదేశ్ నుండి మల్లేపల్లికి మకాం మార్చారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన మాలిక్ సోదరులు యూపీలో ఒక బట్టల దుకాణం కలిగి ఉన్నారు. మల్లెపల్లి లో నివాసం ఏర్పాటు చేసుకున్న నాసిర్ మాలిక్ స్థానికంగా ఓ బట్టల దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నడు. మల్లేపల్లి లో చుట్టూ పక్కల వారు అందరికీ తెలిసింది ఇదొక్కటే. కానీ వీరి అసలు బండారం అధికారులు అరెస్టు చేసే వరకు చుట్టుపక్కల వారికి తెలియలేదు. సికింద్రాబాద్ స్టేషన్ నుండి పేలుడు సామగ్రిని తరలించే ముందు సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్,  వైట్ షుగర్ తో చేసిన ఒక పేలుడు లిక్విడ్ ను మల్లేపల్లిలో ఉంటున్న వీరు ఇంట్లోనే తయారు చేశారు అంటే ఏ స్థాయిలో వీరు ట్రైన్ అయ్యారో అర్దం చేసుకోవచ్చు.

1200 బట్టల షాపులు

మల్లేపల్లి బడే మసీద్ పరిసర ప్రాంతాల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 వందలకు పైగా బట్టల దుకాణాలు ఉన్నాయి..వీరిలో స్థానికులు ఎవరో స్థానికుల ముసుగులో స్లీపర్ సెల్స్ ఎవరో అర్దం కాని పరిస్థితి నెలకొంది . ఇంతలా ఈ వస్త్ర దుకాణాలే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మాలిక్ సోదరులు ఇక్కడే వారి కార్యకలాపాలు కొనసాగించేవారు కాబట్టి.. ఒకవేళ ఈ పేలుడు కు వాళ్ళు స్కెచ్ వేయకుండా ఉండింటే వాళ్ళు లష్కరే తోయిబా స్లీపర్ సెల్స్ అన్న విషయం కూడా ఎవరికీ తెలిసేది కాదు. అంతలా అక్కడి వారిలో కలిసిపోయారు. ఇప్పుడు ఘటన జరిగి అధికారులు అరెస్ట్ లు చేస్తే వీరి అసలు బాగోతం బయట పడింది కానీ నిజానికి అక్కడ ఆ పరిస్థితే ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాంతంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారే. వాటి ముసుగులో ఇంకా ఎంత మంది స్లీపర్ సెల్స్ ఉన్నారో, ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారో ఏదైనా ఘటన జరిగితే గానీ తెలియని పరిస్థితి నెలకొంది. ఇతర ప్రాంతాల నుండి ఇక్కడ టేనెంట్ గా ఉండడానికి వస్తే తప్పనిసరిగా వారికి సంబంధించిన గుర్తింపు పత్రాలను ఓనర్ లకు సమర్పించాల్సి ఉంటుంది. కానీ స్లీపర్ సెల్స్ వాటిని కూడా నకిలీ కార్డులు తయారీ చేసి మేనేజ్ చేసేస్తున్నారు . గతంలో మర్కాజ్ ఘటన తరువాత మల్లేపల్లి పై పోలీసులు దృష్టి పెట్టినట్టు కనిపించినా అది పై పై నే అని తాజాగా రుజువు అయ్యింది. ఏది ఏమైనా మల్లేపల్లి పై ఇంటలిజెన్స్ నిఘా కొరవడింది..ఇక మీదట అయినా  పోలీసుల నిఘా మరింత పటిష్ఠం చేస్తారని ఆశిద్దాం.

Also Read: శ్రీగంధం తోటల్లో ఊహించని సిత్రాలు.. ఖంగుతిన్న ఖాకీలు.. మత్తు పదార్థాల తయారీ గుట్టు రట్టు

ఊర పందుల వాహనం హైజాక్‌..! సినిమా రేంజ్‌లో స్కెచ్.. వీడియో చూస్తే షాకవుతారు..