Ravi Kiran |
Updated on: Jul 02, 2021 | 7:21 PM
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఈ నెల 8వ తేదీన వైఎస్ షర్మిల పార్టీని ప్రకటించనున్నారు. ఫిల్మ్ నగర్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్‌టీపీ ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే 'వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ'గా పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే దీనికి సంబంధించి రోడ్డు మ్యాప్ తాజాగా ఖరారైంది. ఈ నెల 8వ తేదీన వైఎస్ షర్మిల బెంగళూరు నుంచి బైరోడ్డు ఇడుపులపాయకు చేరుకోనున్నారు. జూలై 8వ తేదీ ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయలో ప్రార్థనలు చేసిన అనంతరం కడప నుంచి ప్రత్యేక చాపర్‌లో 2 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు
ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పంజాగుట్ట చౌరస్తాలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్ షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు.
ఇక సాయంత్రం 4 గంటలకు JRC కన్వెన్షన్‌కు చేరుకొని.. 5 గంటలకు వైఎస్ షర్మిల పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నారు.