TSSPDCL Power Bill: మీ ఇంటి కరెంట్ మీటర్ రీడింగ్ మీరే తీసుకోవచ్చు..! అయితే ఇలా చేయండి..!
Do Self Meter Reading: TSSPDCL వినూత్న ఆలోచన చేసింది. ఇక ముందు మీ ఇంటి విద్యుత్ మీటర్ రీడింగ్‌ను మీరే తీసుకోవచ్చు. ఇక ముందు బిల్ ఇచ్చేందుకు సిబ్బంది రావాల్సిన పనిలేదు.
TSSPDCL వినూత్న ఆలోచన చేసింది. ఇక ముందు మీ ఇంటి విద్యుత్ మీటర్ రీడింగ్‌ను మీరే తీసుకోవచ్చు. ఇక ముందు బిల్ ఇచ్చేందుకు సిబ్బంది రావాల్సిన పనిలేదు. ప్రతి నెలా మీ సెల్‌ఫోన్‌తో మీరే మీటర్ రీడింగ్‌ని స్కాన్ చేసి.. బిల్లు తీసుకునే యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు TSSPDCL అధికారులు. కరోనా రోజు రోజుకు విస్తరిస్తుండటంతో విద్యుత్ సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ తరహాలో ఓ యాప్‌ను డిజైన్ చేశారు. బుధవారం Self Meter Reading సేవలను ప్రారంభించారు. ఈ సంస్థ ఐటీ యాప్‌లో ‘కన్జ్సూమర్ సెల్ఫ్ బిల్లింగ్’ ఐచ్ఛికాన్ని జోడించి గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంచింది. ఇందులో కోసం ఈ ఇంద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి….
https://play.google.com/store/apps/details?id=in.tsnpdcl.tsnpdcl
ఇలా చేయండి…
ప్లే స్టోర్ నుంచి TSSPDCL IT యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇప్పటికే ఈ యాప్ వినియోగిస్తున్నవారు సైతం అప్‌డేట్ చేసుకోవాలి. యాప్ తెరవగానే ‘కన్జ్సూమర్ సెల్ఫ్ బిల్లింగ్’ అంటూ కనిపిస్తుంది. కొత్తగా యాప్ వాడుతున్నట్లయితే యునిక్ సర్వీస్ నంబరు, ఈ-మెయిల్, మొబైల్ నంబరు వంటి వివరాలు అక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ మీటర్ బిల్లింగ్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ మీటర్‌ను స్కానింగ్ చేయమని చూపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీటర్‌లో ‘కేడబ్ల్యూ హెచ్’ అంకెలు వచ్చినప్పుడు స్కాన్ చేయాలి. వివరాలన్నీ సక్రమంగా ఉంటే నెక్ట్స్ అని చూపిస్తుంది. దానిని నొక్కగానే ఆన్‌లైన్‌లో బిల్లు కనిపిస్తుంది.
చెల్లింపు సదుపాయం సైతం అందులో ఉంటాయి. ఒకవేళ మీ కంటే ముందే సిబ్బంది వచ్చి మీటర్ రీడింగ్ తీసి ఉంటే? ఆ విషయం యాప్‌లో కనిపిస్తుంది. మీరే ముందు రీడింగ్ స్కాన్ చేసి బిల్లు తీసుకుంటే.. రీడింగ్ సిబ్బందికి ‘బిల్ జనరేటెడ్’ అని సమాచారం వెళుతుంది.
మరి సెల్ఫ్ బిల్లింగ్ ఎంటర్ చేయడం ఎలానో చూద్దాం…
దీని కొరకు మీరు క్రింది రెండు యాప్ లు మొదట download చేయాలి. ఈ లింక్ పై క్లిక్ చేయడంతో మా TSNPDCL యాప్ download చేయవచ్చును…
https://play.google.com/store/apps/details?id=in.tsnpdcl.tsnpdcl
ఈ లింక్ పై క్లిక్ చేయడంతో భారత్ సెల్ఫ్ మీటర్ రీడ్డింగ్ యాప్ చేయవచ్చును…
https://play.google.com/store/apps/details?id=in.coral.met
తర్వాత మీ వివరాలతో యాప్‌లు రెండు లాగిన్ చేయాలి. ఇప్పుడు TSNPDCL యాప్ ఓపెన్ చేయగానే డాష్ బోర్డ్ పై కనబడే మూడో అప్షన్ సెల్ఫ్ రీడ్డింగ్ పై క్లిక్ చేయండి. Submit సెల్ఫ్ రీడ్డింగ్ అప్షన్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీ ఎనిమిది సంఖ్యల యూనిక్ సర్వీస్ నెంబర్(USC) ను ఎంటర్ చేయండి. మీ సర్వీస్ వివరాలు సరిచూసుకొని Confirm బటాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు SCAN KWH పై క్లిక్ చేయండి…ఈ అప్షన్ పై క్లిక్ చేయగానే భారత్ సెల్ఫ్ మీటర్ రీడ్డింగ్ యాప్ లోకి వెళ్తారు. ఈ యాప్ ద్వారా మీరే స్వయంగా రీడ్డింగ్ తీసుకోవచ్చు. రీడ్డింగ్ తీసుకున్న తర్వాత మీటర్‌లోని KWH రీడ్డింగ్ స్కాన్ అవుతుంది. రీడ్డింగ్ సరిచూసుకొని Submit పై క్లిక్ చేయడంతో ఈ ప్రక్రియను పూర్తి అవుతుంది. ఈ విధంగా Submit చేసిన సెల్ఫ్ మీటర్ రీడ్డింగ్‌కు బిల్ మీ మొబైల్ కు SMS రూపంలో వస్తుంది.