Boy Head in Vessel: ఎరక్కపోయి ఇరుక్కుపోయిన బాబు.. బిందెలో చిక్కుకున్న ఆరేళ్ల పిల్లాడి తల..!

లాక్‌డౌన్ పుణ్యమానికి పిల్లలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఏం చేయాలో తోచని చిత్ర విచిత్ర ఆటలాడుతున్నారు. ఇదే క్రమంలో ఓ బాబు సరదా ప్రాణాల మీదకు తెచ్చింది.

Boy Head in Vessel: ఎరక్కపోయి ఇరుక్కుపోయిన బాబు.. బిందెలో చిక్కుకున్న ఆరేళ్ల పిల్లాడి తల..!
Boy Head Stuck In A Vessel
Follow us
Balaraju Goud

|

Updated on: May 13, 2021 | 1:16 PM

Boy Head in Vessel: లాక్‌డౌన్ పుణ్యమానికి పిల్లలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఏం చేయాలో తోచని చిత్ర విచిత్ర ఆటలాడుతున్నారు. ఇదే క్రమంలో ఓ బాబు సరదా ప్రాణాల మీదకు తెచ్చింది. పాపం.. పసిబిడ్డ. గంటల తరబడి నరకయాతన. ఎంత క్షోభ అనుభవించాడో ఏమో.. అనుకోకుండా తల బిందెలో ఇరుక్కుపోయింది. దాని నుంచి బయటపడటానికి తల్లి, బిడ్డ ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటన చూసిన వారికి ముచ్చెమటలు పట్టాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది.

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రానికి చెందిన ఆరేళ్ల రోహిత్ ఆడుకుంటూ బిందెలో తలపెట్టాడు. ఎంత ప్రయత్నించినా.. బయటకు రాలేదు. దాని నుంచి బయటపడటానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఎంత ప్రయత్నం చేసినా.. రాకపోవడంతో.. కట్టర్ సాయంతో కట్ చేసి బిందెను తీశారు స్థానికులు. గంటల పాటు బాలుడు నరకయాతన అనుభవించినా.. చివరకు క్షేమంగా బయటపడ్డాడు.

పిల్లాడి తల బిందెలో ఇరుక్కుపోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. బిడ్డకు ఏమౌతుందో అని కన్నీటి పర్యంతం అయ్యింది. బిడ్డ బయటపడేంత వరకు క్షణమొక యుగంగా గడిచింది. బిందెలో ఇరుక్కుపోయిన పిల్లాడి తలను బయటకు తీసే క్రమంలో అక్కడున్న వారంతా ఊపిరి బిగబట్టారు. కటింగ్ మెషీన్‌ సహాయంతో బిందెను కోసి తలను బయటకు తీశారు. ప్రమాదం నుంచి బయటపడ్డ రోహిత్.. చివరకు సొమ్మసిల్లి పడిపోయాడు. మొత్తంగా ఆరేళ్ల పిల్లాడు క్షేమంగా బయటపడ్డాడు.

Read Also…  Maharashtra Lockdown: మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. జూన్ 1 వరకు లాక్‌డౌన్ ఆంక్షల పొడిగింపు