Maharashtra Lockdown: మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. జూన్ 1 వరకు లాక్‌డౌన్ ఆంక్షల పొడిగింపు

మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను మ‌రోమారు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 1 వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది.

Maharashtra Lockdown: మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం..  జూన్ 1 వరకు లాక్‌డౌన్ ఆంక్షల పొడిగింపు
Maharashtra Government Extends Lockdown
Follow us
Balaraju Goud

|

Updated on: May 13, 2021 | 12:46 PM

Maharashtra extends lockdown:  దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. వైరస్ సెకెండ్ వేవ్ దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. నిత్యం నాలుగు ల‌క్షల‌కుపైగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. అత్యధిక కేసులతో మహారాష్ట్ర అల్లాడిపోతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను మ‌రోమారు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 1 వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది.

బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆరోగ్య మంత్రిత్వశాఖతో పాటు ఇత‌ర‌ మంత్రులు లాక్‌డౌన్‌ను మరో 15 రోజులు అంటే మే చివరి వరకు పొడిగించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో విప‌త్కర ప‌రిస్థితుల‌ను చూసిన తర్వాత మ‌రో15 రోజులపాటు లాక్ డౌన్ పెంచాల‌నే ప్రతిపాద‌న వ‌చ్చింద‌ని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ‌ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. కాగా మ‌హారాష్ట్రలోని 12 జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ ఎత్తివేస్తే మ‌రోమారు క‌రోనా కేసులు పెరిగే అవ‌కాశాలున్నాయ‌ని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Read Also… Hanuman Birth Place: ఎటు తేలని హ‌నుమంతుడి జ‌న్మస్థల రహస్యం.. తిరుమ‌లే అంటున్న టీటీడీ.. పాంపానది తీరం అంటోంది తీర్థ క్షేత్ర ట్రస్ట్‌..!