Hanuman Birth Place: ఎటు తేలని హ‌నుమంతుడి జ‌న్మస్థల రహస్యం.. తిరుమ‌లే అంటున్న టీటీడీ.. పాంపానది తీరం అంటోంది తీర్థ క్షేత్ర ట్రస్ట్‌..!

హనుమా జన్మభూమి వివాదం ఇప్పుడప్పుడే వదలడం లేదు. ఈ అంశంపై తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఇంకా వదలడం లేదు. ఆంజనేయుడు పుట్టింది తిరుమల కొండల్లోని అంజనాద్రి అని చెబుతున్నా ఒప్పుకోవడం లేదు.

Hanuman Birth Place: ఎటు తేలని హ‌నుమంతుడి జ‌న్మస్థల రహస్యం.. తిరుమ‌లే అంటున్న టీటీడీ.. పాంపానది తీరం అంటోంది తీర్థ క్షేత్ర ట్రస్ట్‌..!
Lord Hanuman Birth Place Controversy
Follow us
Balaraju Goud

|

Updated on: May 13, 2021 | 12:16 PM

Lord Hanuman birth place: హనుమా జన్మభూమి వివాదం ఇప్పుడప్పుడే వదలడం లేదు. ఈ అంశంపై తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఇంకా వదలడం లేదు. ఆంజనేయుడు పుట్టింది తిరుమల కొండల్లోని అంజనాద్రి అని చెబుతున్నా ఒప్పుకోవడం లేదు. చర్చకు ఎప్పుడు రమ్మంటారు అంటూ టీటీడీకి మరో లేఖాస్త్రం సందించింది ఆ ట్రస్ట్‌.

హనుమ జన్మభూమి అంశంపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమని ప్రకటించింది హనుమద్‌ తీర్థ ట్రస్ట్. తమకు సమయం అవసరం లేదని… డిస్కషన్‌కు రేపు రమ్మన్నా వస్తామన్నారు ట్రస్ట్ సాధపులు. తమ పరిశోధనపై నమ్మకం లేకనే టీటీడీ ప్రశ్నలు అడుగుతోందని ఆరోపించారు. టీటీడీకి నేరుగా సంబంధంలేని వ్యక్తుల లేఖలకు ఎప్పుడూ అన్సర్‌ చేయమంటూ ఘాటుగా రియాక్ట్ అయింది. లేఖలతో సమయాన్ని వృథా చేయొద్దని ఓ సలహా కూడా ఇచ్చారు హనుమద్ జన్మభూమి ట్రస్ట్ వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి.

హనుమంతుడు పుట్టింది అంజనాద్రే. కానీ, ఆ అంజనాద్రి కర్నాటకలో ఉందా, ఆంధ్రప్రదేశ్‌లో ఉందా. హనుమంతుడు, ఆయన్ను కన్న అంజనీదేవి తప్ప ఎవరూ చెప్పలేరేమో అనిపించే మీమాంస ఇది. ఎందుకంటే ఆంజనేయుడు పుట్టింది తిరుమల ఏడుకొండలలోని అంజనాద్రి అంటోంది టీటీడీ. అనడమే కాదు.. అందుకు సంబంధించిన బ్రహ్మాండపురాణాన్ని హనుమంతుడి బర్త్ సర్టిఫికెట్‌గా చూపిస్తోంది. ఇక్కడే కర్నాటక తెరపైకి వచ్చింది. హనుమంతుడు విషయంలో ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెచ్చింది. మా అంజన్నను మీరెలా క్లెయిమ్ చేసుకుంటారని నిలదీస్తోంది.

హనుమంతుడు పుట్టింది కర్నాటకలోని పంపానది తీరంలో ఉన్న అంజనాద్రి అంటోంది కర్నాటక. అందుకు ఆధారంగా చూపిస్తోంది రామాయణంలోని కిష్కింద కాండ. స్థానిక పురాణం ప్రకారం వాళ్లు అనుకుంటున్న కిష్కింద, అక్కడ ఉన్న కిష్కింద కొండ ఒక్కటే కాబట్టి హనుమాన్ అక్కడే జన్మించాడన్నది కర్నాటకలోని హనుమాన్‌ తీర్థ ట్రస్ట్ వాదన.

వాస్తవానికి ఏడుకొండల్లో ఇప్పుడు ఒక్కో కొండకు ఒక్కో పేరు ఉంది గానీ.. త్రేతాయుగంలో ఏడుకొండలను కేవలం అంజనాద్రిగా పిలిచేవారట. అంతేకాదు.. తిరుగిరులకు మొత్తం 20 పేర్లు ఉన్నాయి. అయితే అంజనాద్రి అన్న పిలుపు వెనుక అంజనీదేవి తపస్సు, ఆంజయనేయుడి పుట్టుకే కారణమని 12 పురాణాలు చెప్పాయంటోంది టీటీడీ నియమించిన కమిటీ.

శ్రీరామనవమి రోజున తిరుమల అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలంగా టీటీడీ నిర్ధారించింది. అంజనాద్రిపై ఉన్న జాపాలి తీర్థమే హనుమంతుని జన్మస్థలంగా ఖరారు చేసింది. ఈ వాదనపై ఆధారాలు కూడా వెల్లడించారు జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధరశర్మ. పౌరాణిక, వాజ్ఞ్మయ, శాసన, చారిత్రక ఆధారాల ద్వారా తాము ఈ నిర్ధారణకు వచ్చినట్టు స్పష్టం చేసింది టీటీడీ కమిటీ. అంతేకాదు సైంటిఫిక్ ఎవిడెన్స్‌ను కూడా సేకరించామంటోంది. గుజరాత్ లోని అంజనా గుహ, హర్యానాలోని కపి స్థలం, మహారాష్ట్రలోనే కైథల్, త్రయంబకేశ్వరలోని అంజనేరి అనే పర్వతం..ఇవేవీ అసలైన జన్మస్థలాలు కావన్నారు. అలా నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవని టీటీడీ బలంగా చెప్తోంది. అయితే, కర్నాటకలోని శ్రీ హనుమద్‌‌ తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాత్రం టీటీడీ వి ఆధారాల్లేని నిరూపణలంటోంది. అసత్యాలతో వెంకటాద్రిని అంజనాద్రిగా మార్చారని, అసలు అంజనాద్రి తమదని చెబుతున్నారు ట్రస్ట్‌లోని సాధువులు.

మొత్తంగా తిరుమలలోనే ఆంజనేయుడు పుట్టాడని టీటీడీ ఎంత గట్టిగా చెబుతోందో.. లేదు కిష్కింద కొండే అని కర్నాటకలోని హనుమాన్ తీర్థ ట్రస్ట్ అంతే గట్టిగా వాదిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నవి మూర్ఖపు, అసత్యపు వాదనలని కూడా ఘాటుగా విమర్శిస్తోంది. మొన్నటికి మొన్న ఏపీ గవర్నర్‌కు, సీఎంకు కూడా లేఖ రాసి ఇన్‌వాల్వ్‌ అవ్వాలని కోరింది తీర్థ ట్రస్ట్‌. దీనిపై ఘాటైన రిప్లై ఇచ్చింది టీటీడీ నియమించిన కమిటీ. అసలు కిష్కింద కొండే హనుమాన్‌ జన్మస్థలం అనేందుకు మీ వద్ద ఉన్న ఆధారాలేంటని… తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రతిలేఖ రాసింది. దీనిపై నేరుగా స్పందించని హనుమద్‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ మరో లేఖ రాసింది. ఇప్పుడు టీటీడీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Read Also… అద్భుతమైన స్కీం.. ప్రతీ నెలా రూ. 1500 జమ చేయండి.. రూ. 53 లక్షలు పొందండి.. వివరాలివే.!