AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Police Calls: డ్రగ్ పార్శిళ్ల పేరుతో పోలీసుల ఫోన్‌ కాల్స్‌.. జాగ్రత్త! హెచ్చరించిన సజ్జనార్

డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ ఫోన్‌ కాల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. అలాంటి వారిపట్ల జాగ్రత్త ఉండాలంటూ సజ్జనార్‌ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ఏమాత్రం అనుమానం రాకుండా అచ్చం పోలీసుల్లాగానే బిల్డప్‌ ఇస్తూ.. తమ ఐడీ కార్డులను, ఎఫ్‌ఐఆర్‌ కాపీలను పంపిస్తూ మోసాలకు తెగబడుతున్నారని హెచ్చరించారు.

Fake Police Calls: డ్రగ్ పార్శిళ్ల పేరుతో పోలీసుల ఫోన్‌ కాల్స్‌.. జాగ్రత్త! హెచ్చరించిన సజ్జనార్
Vc Sajjanar
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Mar 24, 2024 | 5:46 PM

Share

డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ ఫోన్‌ కాల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. అలాంటి వారిపట్ల జాగ్రత్త ఉండాలంటూ సజ్జనార్‌ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ”హాలో.. మేం ముంబై క్రైం బ్రాంచీ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరుతో FedEx లో ఒక పార్శిల్‌ బుక్‌ అయింది. అందులో నకిలీ పాస్‌పోర్టులు, డ్రగ్స్‌ ఉన్నాయి. అంతేకాదు, మీకు ఉగ్రవాద మాస్టర్‌ మైండ్‌ అయిన మహ్మద్‌తో పలు బ్యాంకుల్లో జాయింట్‌ అకౌంట్స్‌ ఉన్నాయి. మీరు తీవ్రమైన కేసులో ఇరుక్కున్నారు.” అంటూ నకిలీ పోలీసుల పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ కాల్స్‌ చేస్తూ  బెదిరింపులకు పాల్పడుతున్నారు. పార్శిళ్లలో డ్రగ్స్‌, తీవ్రవాదులతో బ్యాంక్‌ లావాదేవీలు చేశారంటూ భయభ్రాంతులకు గురిచేస్తూ కోట్లలో కుచ్చుటోపీ పెడుతున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా అచ్చం పోలీసుల్లాగానే బిల్డప్‌ ఇస్తూ.. తమ ఐడీ కార్డులను, ఎఫ్‌ఐఆర్‌ కాపీలను పంపిస్తూ మోసాలకు తెగబడుతున్నారు.

తాజాగా ఐఐటీ హైదరాబాద్‌ పీహెచ్‌డీ స్కాలర్‌కి ఫోన్‌ కాల్‌ చేసి అక్షరాల రూ.30 లక్షలను దోచేశారు. తను ఉగ్రవాదులతో కలిసి జాయింట్‌ అకౌంట్‌ తీశారని, అందులో అనుమానస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. తన లాప్‌ టాప్‌ను, ఫోన్‌ను ఉగ్రవాదులు హ్యాక్‌ చేశారని భయపెట్టారు. ఉగ్రవాద స్లీపర్‌ సెల్స్‌ తో తన కుటుంబానికి ప్రాణహానీ ఉందని, హౌజ్ అరెస్ట్ చేస్తున్నామంటూ చెప్పి 6 రోజుల పాటు ఇంట్లోంచి బయటకు రాకుండా చేశారు. ఈ కేసులతో తనకేం సంబంధం లేదని చెప్పిన వినకుండా భయభ్రాంతులకు గురిచేశారు. జాయింట్ అకౌంట్‌లో అనుమానస్పద లావాదేవీలు ఉన్నాయని, వాటిని పరిశీలించాలని మాయమాటలతో భయభ్రాంతులకు గురి చేశారు.

అంతేకాదు తన కుటుంబ సభ్యులు పొదుపు చేసుకున్న రూ.31 లక్షలను తమ బ్యాంక్‌ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. లావాదేవీలు సక్రమంగా ఉంటే ఆ నగదును తిరిగి ఇచ్చేస్తామని నమ్మించారు. తర్వాత వారు స్పందించలేదు. చివరికి మోసపోయానని గుర్తించిన ఆ ఐఐటీ పీహెచ్‌డీ స్కాలర్‌.. సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నన్ను వ్యక్తిగతంగా కలిసి మోసపోయానని వాపోయారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.

ఇలాంటి నేరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన ఉన్నత విద్యావంతలే.. మోసాలకు గురవడం బాధాకరం అన్నారు సజ్జనార్. అజ్ఞాత వ్యక్తుల నుంచి డ్రగ్స్ పార్శిళ్ల పేరుతో ఫోన్ కాల్స్ కానీ, ఐవీఆర్ కాల్స్ వస్తే వాటికి అసలే స్పందించవద్దన్నారు. వారికి ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని, డ్రగ్స్ కేసు అని, ఉగ్రవాదులతో సంబంధాలని బెదిరించగానే భయపడి డబ్బులు బదిలీ చేయొద్దని సూచించారు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ 1930 ఫోన్ చేయాలని కోరారు. లేదంటే స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..