Hyderabad: వాటర్ బోర్డు కీలక నిర్ణయం.. సిటీలో రాత్రి వేళల్లో కూడా ట్యాంకర్ల సరఫరా
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నీటిని అందజేస్తామని అధికారులు వెల్లడించారు. 580కి పైగా నీటి ట్యాంకర్లను సేవలందిస్తున్నట్లు వివరించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మసీదులకు నీటి కష్టాలు లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని జలమండలి ఎండీ దానకిషోర్ తెలిపారు.

ప్రజంట్ సమ్మర్ సీజన్ నడుస్తోంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి కొరత నడుస్తోంది. చాలా అపార్ట్‌మెంట్స్, వాణిజ్య సముదాయాల్లో.. నీటి ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు జనాలు. బెంగళూరు లాంటి పరిస్థితి లేకపోయినా.. నీటిని అయితే పొదుపుగా వాడుకుంటే చాలా మంచిది. కొరత ఉన్నవారు.. వాటర్ బోర్డు ట్యాంకర్‌ను డబ్బు కట్టి తెచ్చుకోవచ్చు. నగరంలో పెరుగుతున్న నీటి డిమాండ్‌ను తట్టుకోవడానికి హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు (HMWSSB) రాత్రిపూట నీటి ట్యాంకర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ట్యాంకర్ల సరఫరాను పర్యవేక్షించడానికి ప్రత్యేక రాత్రి షిఫ్ట్ అధికారులను నియమించారు. “అదనపు షిఫ్టులతో, పగటిపూట దేశీయ అవసరాలకు, రాత్రి వాణిజ్య అవసరాలకు ట్యాంకర్లను సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం” అని అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నీటిని అందజేస్తామని వెల్లడించారు. 580కి పైగా నీటి ట్యాంకర్లను సేవలందిస్తున్నట్లు వివరించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మసీదులకు నీటి కష్టాలు లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని జలమండలి ఎండీ దానకిషోర్ తెలిపారు.
బెంగళూరులో తీవ్రస్థాయికి చేరిన నీటి కష్టాలు
ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు సిటీ… వాటర్ క్రైసిస్‌తో విలవిల్లాడుతోంది. తాగడానికి కూడా నీళ్లు దొరక్క అల్లాడిపోతున్నారు జనం. దాదాపు రెండు వారాలుగా తీవ్ర గడ్డుపరిస్థితుల్ని ఎదుర్కొంటోంది లేక్స్ సిటీ.
— బెంగళూరు ప్రజల బాధలు వర్ణణాతీతంగా మారాయ్. వారంరోజులకోసారి కూడా స్నానం చేయలేని దుస్థితి. తాగునీటి కోసం కూడా ఆర్వో కేంద్రాల దగ్గర పడిగాపులు పడాల్సిన పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే నరకం చూస్తున్నారు బెంగళూరు ప్రజలు. వాటర్ క్రైసిస్‌తో హోలీ వేడుకలపై ఆంక్షలు విధించింది బెంగళూరు వాటర్ బోర్డ్. పూల్ పార్టీలు, రెయిన్ డ్యాన్స్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే, ఈ నిర్ణయంపై హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయ్. హిందూ పండగపై ఈ ఆంక్షలేంటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు హిందూ నేతలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




