Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC: ఆర్టీసీ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారా.? జాగ్రత్త అంటోన్న సజ్జనార్

తెలంగాణ ఆర్టీసీ ఇటీవల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. పలు విభాగాల్లో ఉన్న ఏకంగా 3035 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహా లక్ష్మీ పథకంలో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యోగులను తీసుకోనున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే తమకు...

TGSRTC: ఆర్టీసీ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారా.? జాగ్రత్త అంటోన్న సజ్జనార్
Tgrtc
Follow us
Ranjith Muppidi

| Edited By: Narender Vaitla

Updated on: Jul 11, 2024 | 4:56 PM

తెలంగాణ ఆర్టీసీ ఇటీవల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. పలు విభాగాల్లో ఉన్న ఏకంగా 3035 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహా లక్ష్మీ పథకంలో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యోగులను తీసుకోనున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారు కొందరు మోసగాళ్లు. ఆర్టీసీ పేరుతో ఉద్యోగాల పేరుతో ఆన్‌లైన్‌ మోసాలకు దెగబడుతున్నారు.

తెలంగాణ ఆర్టీసీ ప్రకటించిన 3035 పోస్టుల భర్తీ ప్రక్రియను తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పూర్తి చేయనుంది. ఇందుకోసం కార్యచరణ రూపొందిస్తున్నారు అధికారులు. దీంతో చాలామంది ఉద్యోగార్థులు.. వివిధ పోస్టులకు అప్లై చేసుకునేందుకు ఉవ్వీళ్లూరుతున్నారు. అయితే ఇదే సమయంలో అభ్యర్థులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక సూచన చేశారు. ఆర్టీసీ జాబ్స్‌కు సంబంధించి.. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ లింకులు వైరల్ అవుతున్నాయని.. అప్రమత్తంగా ఉండాలన్నారు. నకిలీ లింకులు, మోసపూరిట వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగాల భర్తీ కోసం ప్రస్తుతానికి ఎలాంటి నోటిఫికేషన్.. రీలీజ్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. భర్తీకి కసరత్తు మాత్రం ప్రారంభమైనట్లు చెప్పారు.

సజ్జనార్ ట్వీట్..

ఉద్యోగార్థుల అర్హతలు, దరఖాస్తు ఫీజు, ఇతర వివరాలకు సంబంధిచిన వైరల్ అవుతున్న ఫేక్ లింకుల్లో ఎటువంటి వివరాలు నింపొద్దని సజ్జనార్ సూచించారు. ఆయా లింక్స్ క్లిక్ చేసి.. వ్యక్తిగత వివరాలు ఇవ్వడం ద్వారా డేటా చౌర్యం అయ్యే చాన్స్ ఉందన్నారు. నిరుద్యోగులను టార్గెట్‌గా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు దోపిడీలకు పాల్పడుతున్నారని.. అందుకే అభ్యర్థులను అలెర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే RTC జాబ్స్ దరఖాస్తు ప్రక్రియ షూరూ అవుతుందని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ జాబ్స్‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలంటూ వస్తున్న లింక్‌లు ఫేక్ అని వాటిని నమ్మవద్దని ఎక్స్ వేదికగా తెలిపారు.

ఇదిలా ఉంటే నోటిఫికేషన్ లో భాగంగా డ్రైవర్ 2000, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ (2) 114, డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) 84, DM/ATM/మెకానికల్/ఇంజనీర్ 40, డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ 25, మెడికల్ ఆఫీసర్ 14, సెక్షన్ ఆఫీసర్ (సివిల్) 11, అకౌంట్స్ ఆఫీసర్ 06, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 23, మెడికల్ ఆఫీసర్ 14, సెక్షన్ ఆఫీసర్ (సివిల్) 11, అకౌంట్స్ ఆఫీసర్ 06 పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..