AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మిస్టర్ తెలంగాణ మృతి

మిస్టర్ తెలంగాణ, మోడల్, బాడీబిల్డింగ్ ఛాంపియన్ మహ్మద్ సోహైల్ (23) సిద్దిపేట నుండి మిరుదొడ్డికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత అతడిని ఆస్పత్రికి తరలించగా మృత్యువుతో పోరాటం చేసి.. తాజాగా కన్నుమూశాడు..

Telangana: తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మిస్టర్ తెలంగాణ మృతి
Mohd Sohail
Ram Naramaneni
|

Updated on: Jul 11, 2024 | 3:23 PM

Share

తెలంగాణలో విషాదం నెలకుంది. మిస్టర్ తెలంగాణ టైటిల్ విజేత, మోడల్, ప్రముఖ బాడీబిల్డర్ మహ్మద్ సోహైల్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచాడు. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న స్క్రాప్ ఆటోని ఢీకొంది. సోహైల్‌ అతని మిత్రుడు మహ్మద్‌ ఖదీర్‌తో కలిసి జూన్‌ 29న సిద్దిపేట నుంచి మిరిదొడ్డి వైపునకు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సోహైల్‌ను వెంటనే స్థానికంగా ఉన్న హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సోహైల్ కన్నుమూశాడు.

సోహైల్ స్వస్థలం సిద్ధిపేట. తెలంగాణలోని పేరున్న బాడీ బిల్డర్లలో అతడి పేరు ముందు వరసలో ఉండేది. 23 ఏళ్ల వయస్సులోనే బాడీ బిల్డర్‌గా సోహైల్ పలు ఛాంపియన్ షిప్‌లు గెల్చుకున్నాడు.  జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొని విజేతగా నిలిచాడు. సోహైల్ చనిపోవడంతో.. సిద్ధిపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. పిన్న వయస్సులో సోహైల్ మరణాన్ని అతని కుటుంబ సభ్యలు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాడీబిల్డింగ్‌లో మంచి భవిష్యత్తు ఉన్న తన ప్రియమైన స్నేహితుడిని కోల్పోయినందుకు అతని స్నేహితుడు అఫ్రిది విచారం వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న మిరుదొడ్డి పోలీసులు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..