AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాణ్యమైన ఆహారోత్పత్తి మానవాళికి అత్యవసరం.. ఉద్యానవన సాగులో రాష్ట్రాల మధ్య సహకారం ఉండాలన్న నిరంజన్‌రెడ్డి

ప్రపంచంలో ఏ దేశమూ నాణ్యమైన ఆహారోత్పత్తిపై దృష్టి సారించడం లేదని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవేదన..

నాణ్యమైన ఆహారోత్పత్తి మానవాళికి అత్యవసరం.. ఉద్యానవన సాగులో రాష్ట్రాల మధ్య సహకారం ఉండాలన్న నిరంజన్‌రెడ్డి
K Sammaiah
|

Updated on: Jan 28, 2021 | 4:02 PM

Share

ప్రపంచంలో ఏ దేశమూ నాణ్యమైన ఆహారోత్పత్తిపై దృష్టి సారించడం లేదని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల కర్ణాటక పర్యటనలో భాగంగా బెంగుళూరు హెసరగట్ట ఐకార్ – ఐఐహెచ్ఆర్ పరిశోధనా కేంద్రంలో ప్రిన్స్ పల్ సైటింస్టులు, ముఖ్యులతో నిరంజన్‌రెడ్డి సమావేశం అయ్యారు.

నాణ్యమైన ఆహారోత్పత్తిపై దృష్టిసారిస్తే భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందని నిరంజన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యాన సాగులో రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉండాలన్నారు. తెలంగాణ, కర్ణాటక నేలలు, వాతావరణ పరిస్థితులు దాదాపు సమానంగా ఉంటాయని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ రైతులకు అత్మవిశ్వాసం కల్పించడంతో పాటు ఆత్మగౌరవం పెంపొందించే చర్యలు చేపట్టారని నిరంజన్‌రెడ్డి వివరించారు.

రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరంటు పథకాలతో పాటు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచి రైతుకు భరోసానిచ్చారని మంత్రి చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టులతో సాగునీటి లభ్యత పెరిగి, రైతాంగంలో ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసం బలపడిందని నిరంజన్‌రెడ్డి గర్వంగా చెప్పారు. సాగునీటి రాకతో రైతులకు కాకుండా పర్యావరణానికి ఎనలేని మేలు చేకూరిందని వివరించారు. తెలంగాణ వ్యవసాయ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు.

రైతువేదికల నిర్మాణంతో తెలంగాణ వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రపంచంలోని పలు దేశాల ఉద్యాన పంటల సాగును అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్ లో తెలంగాణలో ఉద్యానపంటల సాగు పెంచడమే కాకుండా ఎగుమతుల మీద దృష్టిసారిస్తామని నిరంజన్‌రెడ్డి ప్రకటించారు.

తెలంగాణలో ఆలుగడ్డ సాగు పెంచాలని నిర్ణయించాం దానికి మీ సహకారం కావాలని కర్ణాటక ప్రభుత్వాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. విత్తనపంటల మీద దృష్టి సారించి ఆ దిశగా రైతులను చైతన్యం చేస్తున్నామని చెప్పారు. దైనందిన జీవితంలో ప్రజలు పండ్లు ఆశించినంతగా భుజించడం లేదు. రాబోయే తరాలతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

విశ్వవిద్యాలయాల పరిశోధనలు మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా సాగాలని మంత్రి సూచించారు. రైతులు ఉల్లి విత్పనొత్పత్తిపై దృష్టిసారించాలి .. ఔషధ, సుగంధ పంటలకు మార్కెట్లో ఆదరణ ఉంది .. ఆ దిశగా పరిశోధనలు జరగాలని నిరంజన్‌రెడ్డి సూచించారు. గుజరాత్, హర్యాన రాష్ట్రాలు, స్పెయిన్, ఇజ్రాయిల్, న్యూజిలాండ్ సందర్శించి పంటలపై అధ్యయనం చేయబోతున్నామని వివరించారు.

ఐకార్ – ఐఐహెచ్ఆర్ పరిశోధనా కేంద్రంలో బీర, చిక్కుడు, క్యారట్, మిరప, టమాటా, ముల్లంగి పంటల సాగును తెలంగాణ వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించారు. మొబైల్ కూరగాయల విక్రయ వాహనాల పరిశీలించారు. తెలంగాణలో యువతకు ఈ వాహనాలతో ఉపాధి కల్పించే అంశాలను పరిశీలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ నీరజా ప్రభాకర్, కెఎం పరాశివమూర్తి, హెసరగట్ట ఐకార్ డైరెక్టర్ దినేష్, వివిధ విభాగాల అధిపతులు, ప్రిన్స్ పల్ సైంటిస్టులు కేఎస్ శివశంకర, టీఎస్ అఘోరా, సీకే నారాయణ తదితరులు పాల్గొన్నారు

అన్నదాతలు చేస్తున్న ఆందోళనపై ఆవేదన వ్యక్తం చేసిన సోనూసూద్

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!