AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Inter Results 2023: ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్ధులు.. ‘సరస్వతీ కటాక్షానికి కాదేదీ అడ్డు’

మంగళవారం (మే 9) విడుదలైన తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీల్లో చదివిన విద్యార్ధులు సత్త చాటారు. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వ కాలేజీలో చదివి ప్రతిభాపాటవాలను కనబర్చిన ఈ విద్యార్థులను పలువురు అభినందించారు..

TS Inter Results 2023: ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్ధులు.. 'సరస్వతీ కటాక్షానికి కాదేదీ అడ్డు'
Vaishnavidevi, Javeria Firdos Naba, Rohini, Sirisha
Srilakshmi C
|

Updated on: May 10, 2023 | 11:45 AM

Share
మంగళవారం (మే 9) విడుదలైన తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీల్లో చదివిన విద్యార్ధులు సత్త చాటారు. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వ కాలేజీలో చదివి ప్రతిభాపాటవాలను కనబర్చిన ఈ విద్యార్థులను పలువురు అభినందించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిరుపేద కుటుంబానికి చెందిన సీఎస్‌వీ వైష్ణవిదేవి ఎంపీసీలో 1000 మార్కులకు 991 మార్కులు సాధించింది.

తెలంగాణ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో విరిసిన విద్యాకుసుమాలు..

  • మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఏరియా క్రిష్ణాకాలనీకి చెందిన ఆకుల శిరీష  ఇంటర్‌ ఫస్టియర్‌ (ఎంపీహెచ్‌డబ్ల్యూ)లో 500 మార్కులకుగాను 495 సాధించింది.
  • బాన్సువాడకు చెందిన అక్రమహబీన్‌ అనే విద్యార్థిని అత్యధికంగా 1000 మార్కులకు గానూ 994 మార్కులు సాధించి టాప్‌ ర్యాంకర్ల సరసన నిలిచింది.
  • జామాబాద్‌కు చెందిన ఆరెపల్లి దీక్షిత ఎంపీసీలో 992 మార్కులు సాధించింది.
  • జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పాటిల్‌ వర్ష (బైపీసీ), సీహెచ్‌ రష్మిత (ఎంపీసీ) 992 మార్కులు సాధించారు.
  • ఖమ్మంలోని ఏఎస్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బైపీసీ చదువుతున్న తప్పేట రోహిణి 990 మార్కులు సాధించింది.
  • సత్తుపల్లి చెందిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం హెచ్‌ఈసీ విద్యార్ధిని దాసరి సిరి 972 మార్కులు సాధించింది.
  • నిర్మల్‌ జిల్లా భైంసా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఉర్దూ మీడియం విద్యార్ధిని జవేరియా ఫిర్దోస్‌ నబా సెకండియర్‌ ఎంపీసీలో 990/1000 మార్కులు సాధించగా, అదే కాలేజీకి చెందిన ఫస్టియర్‌కు చెందిన అదీబానాజ్‌ 462/470 మార్కులు సాధించింది.
వీరంతా రెక్కాడితేగానీ డొక్కాడని కూలీల పిల్లలే కావడం గమనార్హం. సంపదకు, సరస్వతీ కటాక్షానికి సంబంధం లేదని ప్రభుత్వ కాలేజీల్లో కూడా చదివి కలలను సాకారం చేసుకోవచ్చని నిరూపించారు.