Bullet Proof Car: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బుల్లెట్‌ ఫ్రూప్‌ కారును కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం

గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కొత్త బులెట్ ప్రూఫ్ వెహికిల్ కేటాయించింది ప్రభుత్వం. గతంలో ఉన్న బులెట్ ప్రూఫ్ వాహనం చాలా సందర్భాల్లో..

Bullet Proof Car: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బుల్లెట్‌ ఫ్రూప్‌ కారును కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం
Mla Raja Singh
Follow us
Subhash Goud

|

Updated on: Feb 28, 2023 | 11:53 AM

గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కొత్త బులెట్ ప్రూఫ్ వెహికిల్ కేటాయించింది ప్రభుత్వం. గతంలో ఉన్న బులెట్ ప్రూఫ్ వాహనం చాలా సందర్భాల్లో రిపేర్‌కు రావడంతో రాజాసింగ్ ఇబ్బంది పడ్డారు. ఇటీవల ఎమ్మెల్యేకు పాకిస్థాన్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ సైతం వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త బులెట్ ప్రూఫ్ వెహికిల్‌ని కేటాయించింది. బెదిరింపు కాల్స్ వల్లే తనకు కొత్త వాహనం వచ్చింది. ఈ వాహనం కూడా ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలని అంటున్నారు రాజాసింగ్. పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం స్థానంలో ఈ వాహనాన్ని కేటాయించింది ప్రభుత్వం.

అయితే పాత వాహనం తరచూగా రిపేరు రావడంతో ఈ విషయాన్ని రాజాసింగ్‌ సీఎం కేసీఆర్‌, డీజీపీ, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ విషయంలో ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఇటీవల రాజాసింగ్‌ తన పాత వాహనాన్ని ప్రగతిభవన్‌ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. అనంతరం.. అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన తన బుల్లెట్ బైక్ మీద వచ్చారు. ఈ నేఫథ్యంలోనే.. రాజాసింగ్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్, మెస్సేజ్‌లు రావటం గమనార్హం. ఈ క్రమంలోనే రాజాసింగ్‌కు పోలీసులు సోమవారం రోజున ఇంకో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కేటాయించారు.

అయితే ప్రస్తుతం రాజాసింగ్‌కు కేటాయించిన బుల్లెట్‌ ఫ్రూప్‌ వాహనం కొత్తది కాకుండా 2017 మోడల్‌ కారు ఇచ్చారు. ఈ బుల్లెట్‌ ఫ్రూప్‌ వాహనంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ప్రస్తుతం తాను శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు వస్తున్నానని, వైట్‌ కలర్‌ బుల్లెట్‌ ఫ్రూప్‌ వాహనాన్ని ధూల్‌పేటలో ఉన్నతన ఇంటికి తీసుకువచ్చినట్లు చెప్పారు. తాను ఇంటికి వెళ్లిన తర్వాత ప్రస్తుతం కారు ఎలా ఉందో పరిశీలిస్తానని అన్నారు. అయితే తనకు కొత్త కారు కావాలన్నది ఏమి లేదని, కాకపోతే కారు కండీషన్‌ ఉంటే చాలని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి