Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అక్కడా నేనే ఉంటా.. ఇక్కడా నేనే ఉంటా.. ఈ నిత్య పెళ్లికూతురు మోసాలు మామూలుగా లేవు..

ఒకరిని పెళ్లి చేసుకోవడం.. గొడవ పెట్టుకుని వెళ్లిపోవడం.. మళ్లీ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం.. ఇదే ఆమె తంతు.. పాపం ఆమె చేతిలో మోసపోయిన వాళ్లే ఈ విషయాన్ని బట్టబయలు చేశారు. వివరాల్లో..

Telangana: అక్కడా నేనే ఉంటా.. ఇక్కడా నేనే ఉంటా.. ఈ నిత్య పెళ్లికూతురు మోసాలు మామూలుగా లేవు..
Marriage
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 28, 2023 | 10:57 AM

ఒకరిని పెళ్లి చేసుకోవడం.. గొడవ పెట్టుకుని వెళ్లిపోవడం.. మళ్లీ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం.. ఇదే ఆమె తంతు.. పాపం ఆమె చేతిలో మోసపోయిన వాళ్లే ఈ విషయాన్ని బట్టబయలు చేశారు. వివరాల్లో కి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ నిత్య పెళ్లికూతురి బాగోతం బట్టబయలయింది. బంధుమిత్రుల మధ్య ఆర్భాటంగా పెళ్లి చేసుకొని, కాపురానికి వెళ్లి ఆ తర్వాత పుట్టింటికి పయనమై.. అటునుంచి అటు మరో వరుడితో తాళికట్టించుకుని, అక్కడి నుంచి ఇంకో ఊరికి వెళ్లి మరో వరుడిని వివాహమాడితే… ఓహో.. నిత్య కళ్యాణానికి నిజమైన కేరాఫ్‌లా ఉంది కదా… అవును రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అదే జరిగింది. మలి దశలో తోడు కోసం రెండో పెళ్లి చేసుకోవాలనే వారినే లక్ష్యంగా చేసుకొని వారికి చక్కగా పెళ్లి అనే ముసుగు వేసి లక్షలు దండుకొంటున్న ఇద్దరినీ వేములవాడలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన భార్య మొగుళ్ల లిస్ట్‌లో తన నెంబర్‌ ఎంతో తెలియక గుండెపగిలిన ఓ బాధితుడే వారిని పోలీసులకు అప్పగించాడు.

నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం తాటిపెల్లికి చెందిన లక్ష్మణ్‌ భార్య ఇరవై ఏళ్ల క్రితం మృతి చెందడంతో రెండో పెళ్లి చేయడంలో స్పెషలిస్ట్‌ అయిన కర్ణాటకకు చెందిన శివకుమార్‌ను సంప్రదించాడు. సదరు స్పెషలిస్ట్‌ రూ.3 లక్షలు తీసుకొని ఓ మహిళతో 8 నెలల క్రితం వివాహం జరిపించాడు. సదరు మహిళ తల్లిగారింటికి వెళ్లొస్తానని చెప్పి కొద్ది రోజులకే వెళ్లిపోయింది. అదే మహిళకు జగిత్యాల జిల్లాలోని మరో వ్యక్తితో శివకుమార్‌ పెళ్లి చేయించాడు. మూడు నెలల తరవాత అతనికి కూడా సెండాఫ్‌ ఇచ్చేసి ఆ మహిళ పారిపోయి మరొకరిని వివాహమాడింది.

అనంతరం.. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ యువతిని బోయినపల్లి మండలానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి జరిపించేందుకు మన సెకెండ్‌ మ్యారేజెస్‌ స్పెషలిస్ట్‌ శివకుమార్‌ ఫిబ్రవరి 27న వేములవాడకు వచ్చాడు. వివాహం చేయించేందుకు సిద్ధమవుతుండగా ఈ విషయం తెలుసుకున్న బాధితుడు లక్ష్మణ్‌, అతని బంధువులు శివకుమార్‌ను పట్టుకొని నిలదీశారు. వెంటనే పోలీసులకు అప్పగించారు. బాధితుడు లక్ష్మణ్‌ ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వెంకటేష్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..