KTR: చిల్లర మాటలతో జనాలను రెచ్చగొడుతున్నారు.. ప్రధాని ఎవరికి దేవుడు.. మంత్రి కేటీఆర్..

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రశ్నించే వారిపై ఈడీ, ఐటీలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటికి తాము భయపడేది లేదని చెప్పారు. ప్రతి చిన్న అంశాన్ని..

KTR: చిల్లర మాటలతో జనాలను రెచ్చగొడుతున్నారు.. ప్రధాని ఎవరికి దేవుడు.. మంత్రి కేటీఆర్..
Minister KTR
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 28, 2023 | 10:27 AM

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రశ్నించే వారిపై ఈడీ, ఐటీలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటికి తాము భయపడేది లేదని చెప్పారు. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం శోడషపల్లిలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణకు పట్టిన శని, దరిద్రం ముమ్మాటికి బీజేపీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతూ మతం, కులం పేరుతో రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల ఆదాయం డబుల్‌ చేస్తామని చెప్పి అదానీ ఆదాయాన్ని 1,300 రెట్లు పెంచారని ఆక్షేపించారు. నల్లధనం ఏమైందని అడిగితే తెల్లమొఖం వేసుకుని తప్పించుకోని తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. రూ.15 లక్షలు ఖాతాలో జమ చేస్తానని చెప్పి.. అన్నీ ఒకే ఒక్కడి ఖాతాలోకి జమ చేశారని ఆరోపించారు.

బుల్లెట్‌ రైళ్లు తీసుకొస్తామన్నారు. ప్యాసింజర్‌ రైళ్లూ తిరగలేని పరిస్థితి. తెలంగాణలో కొత్తగా వంద కిలోమీటర్ల రైల్వేలైన్‌ కూడా వేయలేదు. ప్రధాని మోదీ అరాచక పాలన చేస్తున్నారు. మోదీ దేవుడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన ఎవరికి దేవుడో సమాధానం చెప్పాలి. ‘రూ.400 ఉండే గ్యాస్‌ సిలెండర్‌ను రూ.1,200 చేసినందుకు దేవుడా? రూ.70 ఉన్న పెట్రోల్‌ను రూ.112 చేసినందుకు దేవుడా? నల్లా చట్టాలు చేసి 700 మంది రైతులను చంపినందుకు దేవుడా? తెలంగాణకు ఒక్క ప్రాజెక్ట్‌ ఇవ్వనందుకు దేవుడా? ఖాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ, ములుగులో ట్రైబల్‌ యూనివర్సీటీ ఇవ్వనందుకు దేవుడా?’

       – కేటీఆర్, తెలంగాణ మంత్రి

ఇవి కూడా చదవండి

ఒక్క చాన్స్‌ ఇవ్వాలని కోరుతున్న కాంగ్రెస్‌ నేతలు.. 50 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని నిలదీశారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో తెలంగాణ ఉద్యమం నడిచిందన్న మంత్రి… మన రాష్ట్రంలో మన నిధులు మనకు వస్తున్నాయని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ రోజైనా ఇలా జరిగిందా అని ప్రశ్నించారు. కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ దేవాదుల ప్రాజెక్టుకు రూ.8 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో తెలంగాణ వ్యవసాయం పంజాబ్‌, హర్యానాతో పోటీగా దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ