AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Danam Nagender: చివరి శ్వాస వరకు కేసీఆర్ కేటీఆర్ తోనే.. తప్పుడు ప్రచారం చేస్తే పుట్టగతులు ఉండవుః దానం నాగేందర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే నీటి కష్టాలు తీరాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటలకు మూతి, తోక ఏది ఉండదని విమర్శించారు.

Danam Nagender: చివరి శ్వాస వరకు కేసీఆర్  కేటీఆర్ తోనే.. తప్పుడు ప్రచారం చేస్తే పుట్టగతులు ఉండవుః దానం నాగేందర్
Trs Mla Danam Nagender
Balaraju Goud
|

Updated on: Jul 02, 2021 | 1:12 PM

Share

Danam Nagender Sensational Comments: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే నీటి కష్టాలు తీరాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటలకు మూతి, తోక ఏది ఉండదని విమర్శించారు. ఇక గుంజుకునుడే అంటున్నాడని.. ఇక్కడ గుంజుకోవడానికి ఎవడబ్బ సొమ్ము కాదన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా? నా మీద జరుగుతున్న దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. క్రిమినల్ కేసులు పెట్టాలని కోరాను. నా ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్‌లోనే ఉంటా. కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి ఆ పార్టీలో ఏముంది? కాంగ్రెస్‌లో ఓ వర్గం నన్ను కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. విపక్షాలపై తనదైనశైలి విరుచుకుపడ్డారు. కొత్తబిచ్చగాడు పొద్దెరగనట్లు ఇతర పార్టీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

14 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను గుంజుకోవడం ఎవడబ్బ సొమ్ము కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడక ముందు హైదరాబాద్ ప్రజలకు కనీసం తాగునీరు లేదు. స్వరాష్ట్రంలో తరువాత గ్రేటర్ ప్రజలకు నీళ్ల కష్టాలకు సీఎం కేసీఆర్ చెక్ పెట్టారని గుర్తు చేశారు. అపర భగీరథుడిలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సైలెంట్‌గా ఉన్నారని రెచ్చిపోతున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నిర్మాణాత్మక అభిప్రాయం చెప్పకుండా బండి సంజయ్ రేవంత్ రెడ్డి తలతోక లేకుండా మాట్లాడుతున్నారని దానం నాగేందర్ ఆరోపించారు. దళితుల కోసం ముఖ్యమంత్రి సమావేశం పెడితే రాకుండా ఉండటమే కాకుండా, హాజరైన మోత్కుపల్లిని ప్రశ్నించడం సరికాదన్నారు.

తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. వారిపై కఠినచర్యలు తీసుకుంటానని దానం హెచ్చరించారు. ఉద్యమంలో ఆనాడు మేము లేమని, తెలంగాణ అభివృద్ధిని చూసి కేసీఆర్‌తో నడుస్తున్నామన్నారు. తనపై జరుతున్న దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసానన్నారు. గతంలో వైఎస్సార్ చివరి శ్వాస వరకు ఆయనతోనే ఉన్నామని.. ఇప్పుడు కూడా చివరి శ్వాస వరకు కేసీఆర్, కేటీఆర్‌తోనే ఉంటానని దానం నాగేందర్ స్పష్టం చేశారు. నా దగ్గరకు ఇతర పార్టీ వాళ్లు వస్తే, టీఆరెస్ కండువా కప్పుకుని రావాలన్నారు. వైఎస్సార్ రాజ్యం కంటే డబుల్ అభివృద్ధి కేసీఆర్ చేశారు చేస్తున్నారు

బీజేపీకి కాంగ్రెస్ తెలంగాణలో భవిష్యత్ లేదన్న దానం.. డబ్బులు పెట్టి పదవులు కొనే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదీ అన్నారు. సీనియర్ నాయకులు పార్టీని వదిలిపెట్టాలన్నారు. టీఆర్‌ఎస్ ఏర్పాటులో లేని సీనియర్ కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ఎదురు లేదు.. ఎవరైనా అవాకులు చేవాకులు వాగితే తగిన బుద్ధి చెబుతామన్నారు. అసత్య ప్రచారాలు చేస్తే ఆ పార్టీలకు, నేతలకు పుట్టగతులు ఉండవని దానం శాపనార్థాలు పెట్టారు. మళ్లీ కాంగ్రెస్‌లోకి పోవడానికి ఏముందన్న దానం.. మంత్రి పదవి నేను అడగలేదు, అడగనని మరోసారి స్పష్టం చేశారు.

Read Also… మోదీకి మామిడి పండ్లు పంపించిన దీదీ..! తన సంప్రదాయం పై ప్రశంసలు అందుకున్న మమతా బెనర్జీ :Mamata Banerjee Video.