AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Podu land fight: పోడు చిచ్చుతో పచ్చటి పల్లెల్లో చిందుతోన్న నెత్తురు

పోడు చిచ్చుతో పచ్చటి పల్లెల్లో నెత్తురు చిందుతోంది. అటవీ శాఖాధికారులు - ప్రజాప్రతి నిధుల మధ్య యుద్ధ వాతావరణానికి వేదికగా మారింది. వృత్తి ధర్మమని అటవీశాఖ

Podu land fight: పోడు చిచ్చుతో పచ్చటి పల్లెల్లో చిందుతోన్న నెత్తురు
Podu Cultivation
Venkata Narayana
|

Updated on: Jul 14, 2021 | 1:49 PM

Share

Podu cultivation: పోడు చిచ్చుతో పచ్చటి పల్లెల్లో నెత్తురు చిందుతోంది. అటవీ శాఖాధికారులు – ప్రజాప్రతి నిధుల మధ్య యుద్ధ వాతావరణానికి వేదికగా మారింది. వృత్తి ధర్మమని అటవీశాఖ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటే – దిక్కుతోచని పోడు రైతులు తిరగబడుతున్నారు. పోడు వివాదం రణరంగంగా మారుతుండడంతో పోలీసులు తుపాకులు ఎక్కుపెడుతున్నా రు. బక్క చిక్కిన పోడు రైతులపై బలప్రదర్శన చేస్తున్నారు. వెరసి.. పోడు రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. ఏళ్ల తరబడి వ్యవసాయం సాగు చేసుకుంటున్న పోడు రైతులకు ఒక వైపు రెవెన్యూ అధికారులు పట్టాలు జారీచేశారు. మరోవైపు ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ సిబ్బంది వృత్తి ధర్మం పేరుతో వీరంగం సృష్టిస్తున్నారు.

వరంగల్ ఉమ్మడి జిల్లా ఏజెన్సీలో రోజుకోచోట పోడు వివాదం రణరంగంగా మారుతోంది. పోడు రైతుల తిరుగుబాటుతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి పలువురు అడవిబిడ్డలు ఈ ఘర్షణల్లో గాయపడుతున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 1లక్ష 9వేల ఎకరాల్లో పోడు భూములున్నాయని అటవీశాఖ అధికారులు అంచనా. వాటిని స్వాధీన పర్చుకునేందుకు అటవీ అధికారులు చేయని ప్రయత్నాలు లేవు. ఈ భూములు నిత్యం రణరంగంగా మారుతున్నాయి. రైతుల భూములలో కందకం తీస్తే కబర్దార్ అని ఓ ఎమ్మెల్యే వార్నింగ్ ఇస్తే.. మరో ఎమ్మెల్యే రైతుల కోసం జైలుకైనా వెళ్తానని హెచ్చరించడం అక్కడి పరిస్థితులకు దర్పణంగా మారింది.

కవ్వింపు చర్యలు ఆపకపోతే అటవీశాఖ అధికారులపై తిరగ బడుతామని ఏకంగా ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. పోడు రైతులను ఆగంచేస్తే అధికారుల తడాఖా చూస్తామని, వారిపై వేటు తప్పదని మరో మంత్రి హెచ్చరించారు. ఇలాంటి హెచ్చరికలు.. గిల్లి కజ్జాలను పట్టించుకోని అటవీశాఖ అధికారులు డోంట్ కేర్ అంటున్నారు. వారి వృత్తి ధర్మం నిర్వహిస్తున్నామంటూ పచ్చని భూముల్లో బీభత్సం సృష్టిస్తున్నారు. దీంతో పోడు భూముల వివాదం చిలికిచిలికి గాలివానలా మారుతోంది.

Read also: Monkeys: తెలంగాణ రైతులకు కొత్త సమస్య, భూమి ఉంది.. సాగు నీరుంది.. కానీ పంటలను కాపాడుకోలేని పరిస్థితి.!