Giri Nature Honey: తొలి సహజ తేనె సేకరణ యూనిట్‌.. స్వచ్చతకు మారుపేరు గిరి హనీ.. వావ్ టేస్ట్ గురూ

Giri Nature Honey: తొలి సహజ తేనె సేకరణ యూనిట్‌.. స్వచ్చతకు మారుపేరు గిరి హనీ.. వావ్ టేస్ట్ గురూ
Girijan Giri Nature Honey

Giri Nature Honey: స్వచ్ఛమైన తేనేకు పెట్టింది పేరు ఆదివాసీల‌ ఖిల్లా ఆదిలాబాద్‌ (Adilabad). దేశ వ్యాప్యంగా టాప్ బ్రాండ్ లు సైతం కల్తీ తేనెను మార్కెట్ చేస్తున్నాయంటూ సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (CSE ) రిపోర్ట్ లు..

Surya Kala

| Edited By: Janardhan Veluru

Mar 05, 2022 | 3:04 PM

Giri Nature Honey: స్వచ్ఛమైన తేనేకు పెట్టింది పేరు ఆదివాసీల‌ ఖిల్లా ఆదిలాబాద్‌ (Adilabad). దేశ వ్యాప్యంగా టాప్ బ్రాండ్ లు సైతం కల్తీ తేనెను మార్కెట్ చేస్తున్నాయంటూ సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (CSE ) రిపోర్ట్ లు చెపుతుంటే కేవలం ఒకే ఒక్క తేనె మాత్రం అందరిని నమ్మకాన్ని పెంచుకుంటూ నోరూరించే రుచిని.. అంతకు మించిన ఆరోగ్యాన్ని అందిస్తూ భళా అనిపించుకుంటోంది. అదే టీఎస్‌జీసీసీ(TSGCC) ఆద్వర్యంలో కొనసాగుతున్న గిరితేనె‌.  నిర్మల్(Nirmal)లో కొనసాగుతున్న ఈ గిరితేనె యూనిట్ తెలంగాణలోని తొలి సహజ తేనె సేకరణ యూనిట్‌. ఈ యూనిట్ లో రోజుకు 300 లీటర్ల సామర్థ్యంతో తేనె సేకరణ కొనసాగుతోంది. అడవుల నుండి ఆదిమ గిరిజనులు సేకరించిన స్వచ్చమైన పుట్ట తేనె ఉట్నూర్ , నార్నూర్‌ , ఇంద్రవెళ్లి , భద్రాద్రి కొత్తగూడెం నుండి ఈ యూనిట్ కి చేరుతోంది. ఈ తేనెలో పుష్కలమైన ఔషధ విలువలతో పాటు ఆయుర్వేద లక్షణాలు ఉండటంతో డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ గిరిహనీ అగ్‌మార్క్ నుండి స్పెషల్ గ్రేడ్ తో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ ధృవీకరణను సైతం పొందింది.

నిర్మల్ గిరిహనీ యూనిట్ లో ప్రాసెస్ చేసిన ఈ తేనెను ప్లాస్టిక్ సీసాలలో ప్యాక్ చేసి హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నారు. స్వచ్ఛమైన తేనెను హోల్‌సేల్ డీలర్లకు కిలోకు 250 రూపాయలకు విక్రయిస్తుండగా, రిటైల్ అవుట్‌లెట్లలో కిలోకు రూ. 360 కి విక్రయిస్తుండగా.. యాత్రా స్థలాల్లోను ఈ గిరి తేనె స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. మరో వైపు వినియోగ‌దారుల గుమ్మ‌వ‌ద్ద‌కే స్వ‌చ్ఛ‌మైన గిరి తేనెను అందించేందుకు టీఎస్‌జీసీసీ ఇ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో నిన్న మొన్నటి వరకు దేశానికే పరిమితం అయిన ఆదివాసీల గిరి హనీ.. విదేశాలకు సైతం చేరుతోంది. ఇటు తెలంగాణలోని హైదరాబాద్‌ గిరి బజార్‌ తో పాటు గా అన్ని జిల్లా కేంద్రాల్లోని తెలంగాణ రాష్ట్ర ఖాదీ, గ్రామ పరిశ్రమల బోర్డు ఔట్‌లెట్లలో ఈ గిరితేనె అందించేందుకు సమాయత్తం చేస్తున్నారు. దీంతో వేలాది మంది గిరిజనులకు ఉపాధి కలుగుతోంది.

ఈ స్వచ్చమైన తేనె లో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజ లవణాలతో పాటు.. థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్… లాంటి విటమిన్లూ పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లూ అమైనోఆమ్లాలూ ఎంజైములూ దండిగా ఉన్నాయని.. గిరి హనీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సైతం కితాబిస్తున్నారు. ప్రాసెస్ చేయకుండా నేరుగా తేనెపట్టు నుంచి తీసిన జుంటి తేనెలో ఎంజైములు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా దొరకుతాయని చెపుతున్నారు. ఈగిరితేనెను రోజు తీసుకుంటే ఆరోగ్యపరంగా మరెన్నో లాభాలుంటాయని చెపుతున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం కల్తీ లేని స్వచ్చమైన గిరిహనీని మీరు మీ ఇంటికి తెచ్చుకొండి.

-నరేష్ స్వేన, ఉమ్మడి ఆదిలాబాద్ , టీవి9 తెలుగు

Also Read:

ఏపీలో మరో చోట కిడ్నీ వ్యాధి డేంజర్ బెల్స్.. చికిత్స కోసం ఆస్తులు అమ్ముకుంటున్నా..

 ఏపీ మూడు రాజధానుల అంశంలో హైకోర్టు తీర్పుపై స్పందించిన మాజీ మంత్రి ధర్మాన

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu