Andhra Pradesh: ఏపీలో మరో చోట కిడ్నీ వ్యాధి డేంజర్ బెల్స్.. చికిత్స కోసం ఆస్తులు అమ్ముకుంటున్నా..
Andhra Pradesh: కిడ్నీ సంబంధిత వ్యాధులు(Kidney Disease) అంటే ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) గుర్తుకొచ్చేది. అయితే ఈ లిస్ట్ లో మరో జిల్లా చేరింది.. ఆ జిల్లాలో తెలుగురాష్రాలకు..
Andhra Pradesh: కిడ్నీ సంబంధిత వ్యాధులు(Kidney Disease) అంటే ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) గుర్తుకొచ్చేది. అయితే ఈ లిస్ట్ లో మరో జిల్లా చేరింది.. ఆ జిల్లాలో తెలుగురాష్రాలకు జీవ నదిలో ఒకటైన కృష్ణా నది(Krishna River) ప్రవర్తిస్తోంది.. అయినప్పటికీ సరైన తాగు నీరు దొరక్క.. ఎక్కువ మంది అపరిశుభ్రమైన నీరు తాగి.. కిడ్నీ వ్యాధుల బారినపడుతున్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో జిల్లా వాసులు కృష్ణానది తమ ఊళ్ళ పక్కన ఉన్నప్పటికీ తమకు మంచినీరు అందక ఈ రకంగా కిడ్నీలు పాడై ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ఏరియాలా ఇపుడు కృష్ణ జిల్లోని అనేక ప్రాంతంలోనూ కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నవారు పెరిగిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే..
కృష్ణ జిల్లాలోని అనేక ప్రాంతాల్లోని ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధిబారిన పడి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వందలాది మంది చికిత్స తీసుకుంటున్నారు. జిల్లాలోని ఎ.కొండూరు మండలంలో అనేక గ్రామాల్లో కిడ్నీ బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. చైతన్యనగర్, దీప్లానగర్, చీమలపాడు, పెద్దతండా, మాన్‌సింగ్ తండా, రేపూడితండా, కంభంపాడు, లక్ష్మీపురం వంటి అనేక గ్రామాల్లోని గ్రామస్థుల్లో వందల కొద్దీ కిడ్నీ వ్యాధిబారిన పడుతున్నారు. ఈ వ్యాధిబారిన పడినవారు చికిత్స కోసం వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికే చాలా మంది డయాలసిస్ చేయించుకొంటేగానీ జీవించలేని స్టేజ్ కు వచ్చారని తెలుస్తోంది. అయితే కొంతమంది కిడ్నీ బాధితులు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉండగా ఆర్ధిక పరిస్థితి సహకరించక.. దేవుడి మీద భారం వేసి కాలం వెళ్లదీస్తున్నట్లు తెలుస్తోంది.
అధికారుల లెక్కల ప్రకారం.. ఎ.కొండూరు మండలంలో 20మంది ప్రస్తుతం డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే డయాలసిస్ చేయించుకున్న వారు సైతం మృతి చెందుతున్నారు. దీంతో చాలా మంది గ్రామస్థులు తమ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులను రక్షించుకోవడం కోసం ఉన్న ఆస్తులను సైతం అమ్మకాన్ని పెడుతున్నారు. నెలల తరబడి చికిత్సనందిస్తున్నారు. తమ ఆర్ధిక పరిస్థితికి మించి ఖర్చు పెడుతున్నారు. తమ ఇంట్లో సభ్యులను కాపాడుకోవడం కోసం ఎంత చికిత్స ఇప్పిస్తున్నా ప్రాణాలు దక్కించుకోలేక పోతున్నామని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చీమలపాడు, దీప్లానగర్ తండాలోని పలువురు కిడ్నీ వ్యాధిబారిన పడుతున్నారు. బాధితులకు చికిత్సను అందించడం కోసం బాధిత కుటుంబాలు అప్పు చేసి మరీ లక్షలు ఖర్చు చేశారు. డయాలిసిస్ చేయించుకుంటూనే ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబ సభ్యులకు అప్పులు మిగిలాయి. మరోవైపు కిడ్నీ బాధితులు తమను ప్రభుతం ఆదుకోవాలని.. చికిత్సనందించాలని కోరుతున్నారు. కనీసం తమకు ప్రభుత్వం ఫించను అయినా ఇప్పించమని ఇప్పటికే చాలామంది అధికారులను అడిగామని.. తమ సమస్యను పలువురు నేతలకు విన్నవించుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇలా ఈ మండలంలోని వారు కిడ్నీ వ్యాధుల బారిన పడడానికి కారణం.. ఇక్కడ ఉన్న గ్రామాల్లోని తాగునీటిలో ఫ్లోరైడ్, సిలికాన్ అధికంగా ఉండడమే అని అధికారులు ఎప్పుడో గుర్తించారు.. పరిష్కారంగా పరిశుభ్రమైన తాగునీటి అందించేలా కృష్ణానది నీటిని ఇక్కడకు తీసుకుని రావాలని.. ఇప్పటికే పైప్ లైన్స్ కూడా ఏర్పాటు ప్రతిపాదన కూడా చేశారు. అయినప్పటికీ ఎటువంటి ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Also Read: