Vijayawada: పేగు బంధానికి మాయని మచ్చ.. కొడుకు చేసిన పనికి ఆమరణ దీక్షకు దిగిన తల్లి..
Mother Hunger Strike: తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమీ.. ఈ మాట అనడానికి ఆ తల్లి ఎంతైనా కష్టపడుతుంది. ఎన్నో తప్పులను తన పంటి కింద బిగబడుతూ.. నా కొడుకేగా.. పోతే పోయ్యిందిలే..
Mother Hunger Strike: తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమీ.. ఈ మాట అనడానికి ఆ తల్లి ఎంతైనా కష్టపడుతుంది. ఎన్నో తప్పులను తన పంటి కింద బిగబడుతూ.. నా కొడుకేగా.. పోతే పోయ్యిందిలే.. ఎప్పటికైనా వాడు తెలుసుకుంటాడ్లే అని తన కంటి నుంచి కన్నీరు ఉబికి వస్తున్నా.. కొంగుతో తుడిచేసి.. నా కొడుకు మంచోడు నా కొడుకు మంచోడని.. తన కష్టమంతా కడుపులో దాచుకుని మరీ చాటింపేసి చెబుతుంది.. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని.. తన కొడుకు చేసిన తప్పులను తానే ఎండగట్టుకోవడం అంటే.. అది తన మీద తాను నిందేసుకోవడం. కాబట్టి.. ఎవరికీ చెప్పుకోకుండా.. ఏ సమస్యా లేదన్నట్టుగానే ఇన్నాళ్లు నెట్టుకొచ్చింది. కానీ తప్పడం లేదు. తన కొడుకు మైనర్ గా ఉండగానే భర్త ప్రమాదంలో చనిపోతే.. మొగుడు చేసెళ్లిన అప్పు సొప్పులన్నీ తన భుజాన వేసుకుని.. ఏ కష్టం తెలీకుండా.. కొడుకును పెంచి పెద్ద చేసింది.. అంతేనా అతడు అమెరికా వెళ్లి ఎంఎస్ చేసి లక్షలాది రూపాయలు సంపాదించేంత ప్రయోజకుడ్ని చేసింది.. కానీ అదిగో ఆ కంటి నుండి ధార కడుతున్న ఆ కన్నీటి చుక్కలు ఒక్కొక్కటిగా ఆ కొడుకు చేసిన అరాచకాలను కళ్లకు కట్టించడం లేదూ.. ఏంటమ్మా ఇక్కడింత పెద్ద టెంటు వేసి.. నీ కొడుకు ఫణీంద్ర చౌదరి గురించి ఇంతగా ఆక్రోశం వెళ్లగక్కుతున్నావెందుకు? అని ఆడిగితే ఆమె ఇన్నాళ్ల పాటు కడుపులో దాచుకున్న వెతలన్నీ కతలు కథలుగా ఒక్కొక్కటిగా బయటపడిపోతున్నాయ్..
కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన ఈమెపేరు సత్యకుమారి. కొడుకు వెంకట ఫణీంద్ర చౌదరిని ఎంతో కష్టపడి చదివించి విదేశాలకు పంపింది. అక్కడ స్థిరపడ్డ కొడుకు ఫణీంద్ర. ఈమెను పట్టించుకోవడం మానేశాడు. అంతే కాదు.. తన పేరిట ఉన్న ఆస్థిపాస్తులు కూడా తన కోడలి పేరిట రాసిన ఈమెను బొత్తిగా మరచిపోయాడు. అప్పటికీ జిల్లా కలెక్టర్ రాష్ట్ర గవర్నర్ కి మొర పెట్టుకుందీమె. అయినా సరే ఫలితం లేదు. బాగా డబ్బు చేసిన ఆ కొడుకు తన తల్లి జబ్బులు- అప్పులను అస్సలు లెక్క చేయకుండా- తన ఆర్ధిక రాజకీయ బలమంతా ఉపయోగించి.. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నాడు. గన్నవరం సొసైటీ పేటలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఈ తల్లి- తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతోంది. ముఖ్యమంత్రి జగన్ తన ఆవేదన అర్ధం చేసుకుని.. అధికారులను పురమాయించి- అసలు సిసలు మహిళా దినోత్సవం జరపమంటోంది.
మరి ఈ తల్లి కష్టం తీరేనా? అమెరికాలో ఉన్న ఆ కొడుకు ఫణీంద్ర- దిగి వచ్చి.. అమ్మ ఆవేదన అర్ధం చేసుకుంటాడా? లేకతల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అని నిరూపిస్తాడా. తెలియాల్సి ఉంది.
Also Read: