Revanth Reddy: కొడంగల్ నియోజకవర్గం తుప్పుపట్టింది.. కేటీఆర్ దత్తత తీసుకోవడం వల్లే ఈ ఖర్మ.. రేవంత్..
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కొడంగల్ ను దత్తత తీసుకున్న కేటీఆర్.. ఈ నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్...

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కొడంగల్ ను దత్తత తీసుకున్న కేటీఆర్.. ఈ నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ నియోజకవర్గానికి తుప్పు పట్టిందని విమర్శించారు. కేటీఆర్ దత్తత తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి మినహా ఇతర ఏ ప్రాజెక్టుతోనూ టీఆర్ఎస్ కు సంబంధం లేదన్న రేవంత్.. అన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో నిర్మించినవేనన్నారు. 2019 జనవరి 1 నుంచి కొడంగల్‌కు అధికార పార్టీ అభ్యర్థే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. కొడంగల్ అభివృద్ధికి నిధులు వచ్చే వరకు ఎమ్మెల్యే ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సూచించారు. అసెంబ్లీలో కొడంగల్ అభివృద్ధిపై నిర్దిష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
తెలంగాణలో పశ్చిమ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకే టీఆర్ఎస్, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితను, రాష్ట్రం బీఎల్ సంతోష్‌లను ఎందుకు అరెస్టు చేయడం లేదు. 2009 లో కొడంగల్ కు తాను కొత్త అయినా కడుపులో పెట్టుకొని గెలిపించారు. గుడి, బడి, రోడ్లు, బస్ డిపో, జూనియర్ కాలేజి, డిగ్రీ కాలేజ్ , సబ్ స్టేషన్లు కట్టించాం. కొడంగల్‌లో ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధి తప్పితే ఇంకేం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదు. కేటీఆర్ దత్తత తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. నిధుల కోసం ఎమ్మెల్యే ఆమరణ నిరాహార దీక్ష చేయాలి.
– రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు




కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ గతంలో ప్రకటించారు. ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. గతంలో ఎమ్మెల్యేగా కొడంగల్ లో ప్రాతినిథ్యం వహించారు. టీడీపీని వీడి కాంగ్రెస్ లోకి చేరడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ స్థానాన్ని దక్కించుకోవాలని ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. అందులో భాగంగానే దత్తత ప్రకటన చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం