AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..

Revanth Reddy: రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, వరదల కారణంగా రైతులు పంట నష్టపోయారని..

Revanth Reddy: పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..
Revanth Reddy
Shiva Prajapati
|

Updated on: Jul 26, 2021 | 6:58 PM

Share

Revanth Reddy: రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, వరదల కారణంగా రైతులు పంట నష్టపోయారని టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి అన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ మేరకు తెలంగాణ వ్యాప్తంగా పంట నష్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రైతుల వేల కోట్ల రూపాయల పెట్టుబడి.. వరద పాలైన పరిస్థితి కళ్లముందు కనిపిస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలలో పంట నష్టం తీవ్రంగా ఉందన్నారు. పంట నీట మునిగి, పెట్టిన పెట్టుబడి సర్వం కోల్పోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర బృందాలను రప్పించి క్షేత్ర స్థాయిలో పంట న‌ష్టం అంచ‌నా వేయించే వారని, కానీ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ ఎన్నడూ చేపట్టిన దాఖలాలు లేవన్నారు.

రాష్ట్రంలో పంటల బీమా పథకాలను సైతం అటకెక్కించారని ప్రభుత్వ తీరును రేవంత్ రెడ్డి తూర్పారబట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి పంటల బీమా యోజన పథకం కానీ, సవరించిన వాతావరణ పంటల బీమా పథకం కానీ రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆరోపించారు. ఈ పథకాలు అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ప్రీమియం చెల్లించాల్సి వస్తుందన్న దురుద్ధేశంతో ఈ పథకానికి మంగళం పాడారు విమర్శించారు. జాతీయ వ్యవసాయ బీమా సంస్థ రాష్ట్రంలో వర్ష బీమా – 2021 పేరుతో అమలు చేస్తోన్న పథకంలో కేవలం ఏడు పంటలకు మాత్రమే పరిమితం అయ్యిందన్నారు. కూలీ రేట్లు పెరగడంతో ఉత్పాదక ఖర్చులు 20 శాతానికి పైగా అదనంగా పెరిగాయన్నారు.

ఇదే సమయంలో రుణమాఫీ హామీని కూడా రేవంత్ రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. రూ. లక్ష రుణమాఫీ చేస్తామని 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో మీరిచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. రుణం మాఫీ కాకపోవడం, మాఫీ అవుతుందని రైతులు బాకీ చెల్లించకపోవడంతో.. బ్యాంకులు రైతులకు కొత్త అప్పులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ మాత్రం 24 గంటలూ హుజూరాబాద్ ఎన్నికలలో గెలుపు కోసం ఎత్తులు, జిత్తులు వేసుకునే పనిలో మునిగిపోయారని అన్నారు. ‘మూడు వేల కోట్లు ఖర్చు చేసైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక గెలవాలన్న పట్టుదలతో ఉన్న మీకు రైతులకు వెయ్యి కోట్లు సాయం చేయాలన్న ధ్యాస లేకపోడవం శోచనీయం’ అని కేసీఆర్‌ తీరును రేవంత్ రెడ్డి విమర్శించారు.

రైతుల కోసం రేవంత్ డిమాండ్లు ఇవే.. భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేయించాలి. పంటల బీమా అమలు కాకపోవడానికి మీ నిర్లక్ష్యమే కారణం కాబట్టి… రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలి. కొత్తగా పంటలు వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్ ఫుడ్ సబ్సిడీ ఇవ్వాలి. తదుపరి పంటల నుంచి ప్రభుత్వం ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకాల అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలి. తక్షణం రూ.లక్ష రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయాలి.

Also read:

Tokyo Olympics 2020 Live: నిరాశపరిచిన భారత స్విమ్మర్ సజన్ ప్రకాష్.. సెమీఫైనల్స్‌కు డిస్ క్వాలిఫై.!

Sherlyn Chopra: రాజ్‌కుంద్రా కేసులో కొత్త ట్విస్ట్‌.. హీరోయిన్ షెర్లిన్ చోప్రాకు సమన్లు..

ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన కేంద్రం.. పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయంపై మరోసారి స్పష్టత!