Peddireddy Resign: తెలంగాణ బీజేపీకి మరో షాక్.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఇనగాల పెద్ధిరెడ్డి రాజీనామా
తెలంగాణలో బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కీలక నేతలు ఒక్కో్క్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా హుజూరాబాద్‌లో కీలక నేత, మాజీ మంత్రి ఇనగాల పెద్దిరెడ్డి బీజేపీకి గుడ్‌బై చెప్పారు.
Former Minister Enugala Peddireddy resignation: తెలంగాణలో బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కీలక నేతలు ఒక్కో్క్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా హుజూరాబాద్‌లో కీలక నేత, మాజీ మంత్రి ఇనగాల పెద్దిరెడ్డి బీజేపీకి గుడ్‌బై చెప్పారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక దగ్గరి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పెద్దిరెడ్డి. తమతో కనీసం చర్చించకుండానే ఈటలను చేర్చుకున్నారని, పార్టీలో తమకు గుర్తింపు లేదా అని ప్రశ్నించారు. తన అనుచరులతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేశారు పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి ఇవాళ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపారు. పార్టీలో కొనసాగేందుకు మనసు అంగీకరించడం లేదని, మారిన రాజకీయాల దృష్ట్యా పార్టీలో కొనసాగలేనని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఇదిలావుంటే, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా గత వారం క్రితమే బీజేపీకి రాజీనామా చేశారు. సుదీర్ఘకాలం పాటు టీడీపీలో ఉన్న పెద్దిరెడ్డి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన గతంలో ప్రాతినిథ్యం వహించాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి టీడీపీని వీడి బీజేపీలో చేరారు.