Revanth Reddy: నేను తల్చుకుంటే ఇక్కడ నీ ఇల్లు, థియేటర్‌ ఉండవు.. ఎమ్మెల్యే గండ్రకు రేవంత్‌ రెడ్డి వార్నింగ్‌

తనపై బీఆర్ఎస్ కార్యకర్తల ఆకస్మిక దాడికి రేవంత్ రెడ్డి సైతం తీవ్రంగా స్పందించారు. రేవంత్ ఇచ్చిన ప్రొద్బలంతో.. బీఆర్ఎస్ కార్యకర్తలపైకి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా.. రాళ్లు సీసాలు రువ్వడంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Revanth Reddy: నేను తల్చుకుంటే ఇక్కడ నీ ఇల్లు, థియేటర్‌ ఉండవు.. ఎమ్మెల్యే గండ్రకు రేవంత్‌ రెడ్డి వార్నింగ్‌
Revanth Reddy
Follow us

|

Updated on: Mar 01, 2023 | 6:35 AM

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కేంద్రంలో రేవంత్ పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇక్కడ రేవంత్ రెడ్డి కార్నర్ షోలో మాట్లాడుతుండగా.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కాసారిగా రాళ్లు విసరడం మొదలు పెట్టారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. రేవంత్ రెడ్డి గో బ్యాక్ అంటూ వీరు అరిచిన అరుపులకు ఈ ప్రాంతంతా అలజడి చెలరేగింది. అంతే కాదు వీరు రాళ్లు, టమోటా, కోడిగుడ్లు విసరడంతో పోలీసులు.. రంగంలోకి దిగాల్సి వచ్చింది. వీరిని కంట్రోల్ చేయడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. మరోవైపు తనపై బీఆర్ఎస్ కార్యకర్తల ఆకస్మిక దాడికి రేవంత్ రెడ్డి సైతం తీవ్రంగా స్పందించారు. రేవంత్ ఇచ్చిన ప్రొద్బలంతో.. బీఆర్ఎస్ కార్యకర్తలపైకి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా.. రాళ్లు సీసాలు రువ్వడంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇది ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అనుచరుల పనేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. గుడ్లు, టమాటలు వేయించడం కాదనీ.. దమ్ముంటే డైరెక్ట్ గా రావాలని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. తాను తలుచుకుంటే.. ఇక్కడ నీ ఇల్లు కూడా ఉండదని హెచ్చరించారాయన. ‘కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించిన ఇక్కడి ఎమ్మెల్యే దొరగడీలో గడ్డి తినేందుకు పార్టీ ఫిరాయించారు. మీ అభిమానాన్ని తాకట్టు పెట్టిన పార్టీ ఫిరాయించిన సన్నాసులకు బుద్ది చెబుదాం. వంద మందిని తీసుకొచ్చి మా సభ మీద దాడి చేయిస్తావా? దమ్ముంటే నువ్వు రా బిడ్డా.. ఎవరినో పంపించి వేషాలు వేస్తున్నావా..? నేను అనుకుంటే నీ థియేటర్ కాదు.. నీ ఇల్లు కూడా ఉండదు. రెండు పార్టీలు ఒకేరోజు సభ పెట్టకూడదని మేం ఆ రోజు యాత్రకు విరామం ఇచ్చాం. ఇవాళ ఆవారా గాళ్లు దాడులుచేస్తే పోలీసులు అడ్డుకోకుండా చోద్యం చూస్తారా? ఎస్పీ ఎమ్మెల్యే చుట్టమనే ఇలా వ్యవహరించారా’ అని రేవంత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా భూపాలపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు రేవంత్‌ రెడ్డి. దమ్ముంటే BRS ఎమ్మెల్యే నేరుగా వచ్చి తనతో తేల్చుకోవాలని తాగుబోతులను తన మీదకి పంపడం కాదని రేవంత్ హెచ్చరించారు. ఎమ్మెల్యే నేరుగా అంబేద్కర్‌ సెంటర్‌ కి వస్తే ఉరికించి కొడతానని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇరువర్గాలు ఒకరిపై మరొకరు రెచ్చిపోగా.. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. రెండు వర్గాలను పోలీసులు నిలువరించారు. రాళ్ల దాడిలో కాటారం ఎస్ఐ కి గాయాలు కాగా.. వెంటనే ఆసుపత్రికి తరలించారు.

వీడియోను ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..