Telangana: తొలకరితో పులకరింత.. పాలధారలా పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతాలు! వీడియో

తెలంగాణ నయాగరా జలపాతాలుగా పేరుగాంచిన బొగత జలపాతాలు పాలధారలా జాలువారుతున్నాయి. చూపరులను కనువిందు చేస్తున్నాయి.. తొలకరి వరద నీటితో జలపాతాలకు సరికొత్త కళ సంతరించుకుంది.. ఇప్పుడిప్పుడే జనం జలపాతాల వద్దకు పరుగులు పెడుతున్నారు..

Follow us

| Edited By: Srilakshmi C

Updated on: Jun 20, 2024 | 9:32 AM

ములుగు, జూన్‌ 20: తెలంగాణ నయాగరా జలపాతాలుగా పేరుగాంచిన బొగత జలపాతాలు పాలధారలా జాలువారుతున్నాయి. చూపరులను కనువిందు చేస్తున్నాయి.. తొలకరి వరద నీటితో జలపాతాలకు సరికొత్త కళ సంతరించుకుంది.. ఇప్పుడిప్పుడే జనం జలపాతాల వద్దకు పరుగులు పెడుతున్నారు.

తెలంగాణ నయాగరా బోగత జలపాతాలలో తొలకరి వరద నీరు జాలువారుతుంది. 50 అడుగులు ఎత్తునుండి పాలధారలా జాలువరుతున్న జలపాతాలను వీక్షించేందుకు జనం పరుగులు పెడుతున్నారు. జలపాతాలలో జలకాలాడుతూ తనివితీరా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో జలపాతాలకు కాస్త ఆలస్యంగా జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లోని చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో బొగత జలపాతాలకు జలకళ సంతరించుకుంది.

ములుగు జిల్లా వాజేడు మండలం చేకుపల్లి సమీపంలోని బోగత జలపాతాలు ప్రస్తుతం చూడడానికి కన్నుల విందుగా కనిపిస్తున్నాయి. ఎంత దూరం ప్రయాణం చేసినా ఈ జలపాతాలు కంటపడితే చాలు ఆ అలసట మరిచిపోయి తన్మయత్వంతో ఉప్పొంగిపోయేలా చేస్తాయి. బోగత జలపాతాలు సందర్శనకు వచ్చే జనం తినివితీరా ఎంజాయ్ చేస్తారు. ఈ ఆదివారం సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.