Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP- Telangana: తెలుగు రాష్ట్రాల్లోని టాప్-9 న్యూస్ మీ కోసం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ పీక్‌కి చేరింది. పోలింగ్‌కి సర్వం సిద్దమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది ఎన్నికల కమిషన్. ఏపీ, తెలంగాణలోని టప్ 9 న్యూస్ తెలుసుకుందాం పదండి...

AP- Telangana: తెలుగు రాష్ట్రాల్లోని టాప్-9 న్యూస్ మీ కోసం
Top 9 News
Follow us
Ram Naramaneni

|

Updated on: May 12, 2024 | 9:49 PM

  1. ఎన్నికల ప్రచారం ముగియడంతో సీఎం రేవంత్ రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. తనకెంతో ఇష్టమైన ఫుట్ బాల్‌ ఆడుతూ సేదతీరారు. ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో గచ్చిబౌలి మైదానంలో నిర్వహించిన ఫుట్ బాల్ టోర్నీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులతో కలిసి రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడారు.
  2. నిన్నటి వరకూ ప్రచారంలో బిజీబిజీగా గడిపిన కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి జి.కిషన్ రెడ్డి దేవాలయాల బాటపట్టారు. అంబర్‌పేట మహంకాళి అమ్మవారు, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాలను సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
  3. 3.కడప జిల్లా పులివెందులలో ఒక్కసారిగా మారింది వాతావరణం. భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షానికి టెంట్లు కూలిపోయాయి. కుర్చీలు ఎగిరిపడ్డాయి. వర్షానికి ముందే EVMలు పోలింగ్ కేంద్రాలకు తరలించారు. దీంతో విధులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు.
  4. అటు కామారెడ్డి జిల్లా కేంద్రంలోను భారీ వర్షం దంచికొట్టింది. ఈవీఎంలు తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి టెంట్లు కూలిపోయాయి. దీంతో పోలింగ్‌ సిబ్బంది అవస్థలు పడ్డారు. వర్షంలోనే పలుప్రాంతాలకు EVMలను తరలించారు సిబ్బంది.
  5. కొమురం భీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బందిపడ్డారు. భారీ వర్షం దాటికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన టెంట్లు పడిపోయాయి. వరండాలో తలదాచుకున్నారు ఎన్నికల సిబ్బంది.
  6. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో EVMలను మరపడవలపై తరలించారు. కాట్రేనికోన మండలం మగసానితిప్ప దీవికి EVMలు, ఎన్నికల సామాగ్రిని మర పడవపై తీసుకెళ్లారు పోలింగ్ సిబ్బంది. గోదావరి నదీపాయలో సుమారు గంట సేపు పడవలో ప్రయాణం చేసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు సిబ్బంది.
  7. మరికొద్ది గంటల్లో పోలింగ్ జరుగుతున్న క్రమంలో విశాఖలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు ముమ్మరం చేశారు. కారులో తరలిస్తున్న కోటిన్నర నగదు పట్టుకున్నారు. పోలీసుల రాకతో నిందితులు కారు వదిలి పారిపోయారు. నగదుతో పాండురంగాపురం వైపు కారు వెళ్తున్నట్లు గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
  8. విశాఖలో ఓటర్లకు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు ఓకళాకారుడు. ఆర్కే బీచ్‌ దగ్గర డప్‌ కొడుతూ పాట పాడుతూ ఓటు వినియోగించుకోవాలని కోరాడు. ఓటే ఆయుధం.. ఓటే మన వజ్రాయుధం, ఓటు వేయకుంటే మన బ్రతుకే వ్యర్థం అంటూ పాటద్వారా అవగాహన కల్పించాడు.
  9. తిరుపతిలో ఓటు హక్కు వినియోగంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు రెస్టారెంట్ ఓనర్స్. కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా కొన్ని రెస్టారెంట్లు ఫుడ్ డిస్కౌంట్స్ ప్రకటించాయి. మీ ఓటు మీది, అది వినబడేలా చూసుకోవాలంటూ పోస్టర్స్ పెట్టి ఓటర్లను ప్రొత్సహిస్తున్నారు.